హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో ఘనత.. దేశంలోనే జగన్ సర్కార్ టాప్..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో ఘనత.. దేశంలోనే జగన్ సర్కార్ టాప్..

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

సంక్షేమ పథకాల అమలు (AP Welfare Schemes), కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) కార్యక్రమాన్ని రికార్డుస్థాయిలో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)మరో ఘనత సాధించింది.

  సంక్షేమ పథకాల అమలు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రికార్డుస్థాయిలో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. లక్షలాది మంది పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ ఏపీకి దక్కింది. ప్రభుత్వమై లబ్ధిదారుల తరపున బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి అయోగ్ ప్రకటించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో బీమా కింద ఉచిత వైద్యం అందిస్తున్నారనే అంశంపై నీతి అయోగ్ గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 74.60 శాతంతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తున్నవారికంటే ఎక్కువ మందే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా ట్రీట్ మెంట్ అందేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తోంది.

  పేదవారికి ఇంతపెద్ద ఎత్తున ఉచిత బీమా కిందకు తీసుకువచ్చి వైద్యం అందిస్తున్న ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి లేదని నితిఆయోగ్ స్పష్టం చేసింది. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఏపీతో పోటీపడలేకపోయాడు. అలాగే మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో అయితే కేవలం 15శాతం మంది మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకు వచ్చినట్లు నీతిఆయోగ్ స్పష్టం చేసింది.

  ఇది చదవండి: ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు... ఆనందయ్య సంచలన ప్రకటన...


  కరోనాకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మహమ్మారికి ట్రీట్ మెంట్ అందించేలా చర్యలు తీసుకుంది. అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందించేలా జీవోలు కూడా ఇటీవల జారీ చేసింది. తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా రూ.5లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారందరికీ వర్తింపజేయడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గింపు…? ఉద్యోగ సంఘాల రియాక్షన్ ఇదే..


  అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. తాజాగా ఇన్యూరెన్స్ కవరేజ్ కు సంబంధించి నీతిఆయోగ్ విడుదల చేసిన జాబితాలో ఏపీ టాప్ ప్లేస్ సాధించడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ఆసరా పథకం కింద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఆర్ధికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డయాలసిస్ పేషెంట్లకు నెలనెలా పెన్షన్ కూడా అందిస్తోంది.

  ఇది చదవండి: యువకుడితో వివాహిత ఎఫైర్.. సీక్రెట్ గా వీడియో తీయించిన ప్రియుడు.. ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా..

  Published by:Purna Chandra
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Central Government

  ఉత్తమ కథలు