హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ఏడాది పాటు సెలవులు.. వివరాలివే..!

AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ఏడాది పాటు సెలవులు.. వివరాలివే..!

ఏపీ సచివాలయం (ఫైల్)

ఏపీ సచివాలయం (ఫైల్)

AP Government: తాజాగా పీఅర్సీ నివేదిక ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులపై ఉత్తర్వులిచ్చింది. ఈ విషయంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సెలవలువ విషయంలో రిలీఫ్ ఇచ్చింది.

ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పలు రకాల వెసులుబాటులు కల్పిస్తోంది. ఇటీవలే పీఆర్సీ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్ల పాటు పెంచింది. తాజాగా పీఅర్సీ నివేదిక ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులపై ఉత్తర్వులిచ్చింది. ఈ విషయంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సెలవలువ విషయంలో రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులను రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. 11వ పీఆర్సీ నివేదికలోని సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరైనా ఉద్యోగినులు పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజుల వరకు సెలవులు మంజూరు చేస్తారు. ఐతే ఇద్దరు పిల్లల లోపు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఏడాది లోపు వయసున్న పిల్లల విషయంలోనే సెలవులిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పురుషులకు కూడా 15 రోజుల పితృత్వపు సెలవులు మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒంటరిగా ఉంటున్నవారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. ఐతే దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే.. ఏడాది పాటు సెలవు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పిల్లలు 6-7 నెలల లోపు వయసున్నవారైతే ఆరు నెలల సెలవులిస్తారు. పిల్లల సంరక్షణ కోసం తీసుకునే 180 రోజుల సెలవులను.. సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

ఇది చదవండి: ఏపీ రాజధానిపై గందరగోళం.. బొత్స వ్యాఖ్యలతో కొత్త చర్చ.. వైసీపీ వ్యూహం ఇదేనా..?


ఇక దీర్ఘకాలిక జబ్బుల అంటే కిడ్నీ వ్యాధులు, క్షయ, క్యాన్సర్, కుష్టు వంటి జబ్బులతో బాధపడేవారికి అసాధారణ సెలవుతో పాటు ఎక్స్ గ్రేషియా కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాన్ గెజిటెడ్ అధికారుల్లో మూలవేతనం రూ.35,570కు పరిమితం చేస్తూ.. ఎక్స్ గ్రేషియాను రూ.11,560-17,780గా నిర్ణయించింది. అలాగే లాస్ట్ గ్రేడ్ ఉద్యోగికి రూ.10,000-రూ.15,000గా నిర్ణయించింది. ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసేవారికి, ఎముకల సమస్యల వంటివి ఎదుర్కొంటున్నవారికి ఏడాదికి అదనంగా ఏడు రోజుల సెలవులు మంజూరు చేసింది.

ఇది చదవండి: పొలిటికల్ పార్టీపై బ్రదర్ అనిల్ దృష్టి..? అదే జరిగితే జగన్ కు లాభమా..? నష్టమా..?


ఆ టీచర్లకు షాక్

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. టీచర్లకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. టెన్త్ విద్యార్థులకు బోధిస్తున్న టీచర్లకు పరీక్షల వరకు సెలవులు మంజూరు చేసేది లేదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముందని.. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టెన్త్ క్లాస్ కు బోధించే టీచర్లకు సెలవులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తీవ్ర అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెలవులు మంజూరు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

First published:

Tags: Andhra Pradesh, Ap government, Employees

ఉత్తమ కథలు