Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT TOOK KEY DECISION ON KONASEEMA DISTRICT NAME FULL DETAILS HERE PRN GNT

AP New Districts: కోనసీమ జిల్లా పేరు మార్పు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పేరు ఇదే..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవలే కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాలకున్న ప్రాముఖ్యత, ప్రముఖుల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం పేర్లు పెట్టింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవలే కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాలకున్న ప్రాముఖ్యత, ప్రముఖుల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం పేర్లు పెట్టింది. ఐతే కొన్ని జిల్లాలపై అభ్యంతరాలు, డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏర్పడిన కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో కీలక ప్రకటన చేసింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆ జిల్లా పేరును డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (BR Ambedkar District) గా నామకరణం చేసింది.

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పేర్లపై చర్చ జరిగింది. పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన ప్రబుత్వం.., పార్వతీపురం జిల్లాకు మన్యం జిల్లాకో నామకరణం చేసింది. ఇక విజయవాడ (Vijayawada) కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏన్టీఆర్ పేరు పెట్టగా.. వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అలాగే రాజంపేట జిల్లాకు అన్నమయ్యపేరు పెట్టి.. రాయచోటిని కేంద్రంగా ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అలాగే హిందూపురం జిల్లాకు శ్రీసత్యసాయి జిల్లాగా పేరుపెట్టిన ప్రభుత్వం.. హిందూపురంను కాకుండా పుట్టపర్తిని హెడ్ క్వార్టర్స్ చేయడంపై స్థానికులు మండిపడ్డారు.

    ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పవర్ హాలిడే ఎత్తివేత.. ఇకపై నాన్ స్టాప్ పవర్..


    అలాగే తిరుపతి జిల్లా (Tirupati District) పేరు విషయంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. తొలుత ఈ జిల్లాకు ప్రభుత్వం శ్రీబాలాజీ జిల్లాగా నామకరణం చేయగా.. స్థానికులు వ్యతిరేకించారు. స్థానికులు వెంటకటేశ్వరస్వామిని శ్రీవారు లేదా వెంకన్న అని పిలుస్తాకని.. శ్రీ బాలాజీ అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ పలుకుతారని..అందుకే పేరు మార్చాలని కోరడంతో ప్రభుత్వం తిరుపతి జిల్లాగా మార్చి తుది నోటిఫికేషన్ ఇచ్చింది.

    ఇది చదవండి: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచ‌న‌లో అలీ..? కారణం ఇదేనా..?


    కోన సీమ జిల్లా విషయంలోనూ తొలి నుంచి అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్లు వచ్చాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎస్సీలుంటారు. అలాగే నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో తమకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించిన బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని స్థానికంగా ఉన్న ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జిల్లా ఏర్పడిన నెలన్నర తర్వాత పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పేరును మార్చడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. తమ కోరికను మన్నించిన సీఎం జగన్ కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts

    తదుపరి వార్తలు