AP Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై నెలరోజులే ఈ సౌకర్యం..

ఏపీ సచివాలయం (ఫైల్)

రాష్ట్ర విభజన (AP Bifurcation) తర్వాత హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం (Andhra Pradesh Secretariat), అసెంబ్లీ (Assembly), వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను అమరావతి (Amaravathi), విజయవాడ (Vijayawada) ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    రాష్ట్ర విభజన (AP Bifurcation) తర్వాత హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం (Andhra Pradesh Secretariat), అసెంబ్లీ (Assembly), వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను అమరావతి (Amaravathi), విజయవాడ (Vijayawada) ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే. గుంటూరు,మంగళగిరి, విజయవాడ (Vijayawada)పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, అసెంబ్లీలో పనిచేస వేలాది మంది ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి ఏపీకి తరలివచ్చారు. దీంతో వారు నివాసముండేందుకు అనువుగా రాష్ట్ర ప్రభత్వమే వసతి కల్పిస్తోంది. కుటుంబాన్ని హైదరాబాద్ లో వదిలి సింగిల్ గా వచ్చిన వారి బ్యాచిలర్ తరహా వసతి కల్పించింది. మంగళగిరి, గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వారికి ఇల్లు చూపించి ప్రభుత్వమే అద్దె చెల్లిస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగుల ఇంటి అద్దెలను భరిస్తోంది.ఐతే దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    సెక్రటేరియట్, అసెంబ్లీ, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని త్వరలోనే నిలిపివేయనుంది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని అక్టోబరు 31తో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులు ఎవరి వసతి వారే చూసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఉచిత వసతి సౌకర్యం పొందుతున్నవారిలో శాశ్వత ఉద్యోగులతో పాటు తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగిస్తూ వస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఎకౌంట్లలో డబ్బులు..


    గత ఏడాది పొడిగించిన ఉత్తర్వులు ఈ ఏడాది జూన్ తో ముగిశాయి. ఐతే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 31వరకు పొడిగించింది. ఇటీవల ఉద్యోగులు వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత వసతిని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం మాత్రం అక్టోబర్ 31 వరకే పరిమితం చేసింది. దీంతో ఉద్యోగులు ఇళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జీవోపై ఉద్యోగ సంఘాలు ఇంతవరకు స్పందించలేదు. ఐతే దాదాపు ఐదేళ్ల పాటు ఉద్యోగులకు ఉచిత కల్పించిన ప్రభుత్వంపై కోట్లాది రూపాయల భారం పడింది. ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: దసరాకు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి.



    ఏపీ సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ కార్యాలయాల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే కుటుంబాలతో సహా అమరావతికి షిఫ్ట్ అయ్యారు. కొద్దిమంది మాత్రం ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లో ఉంటూ శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు కుటుంబాలను వదిలి ఇక్కడకు రావడంతో అప్పటి ప్రభుత్వం వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించింది. ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తోంది.
    Published by:Purna Chandra
    First published: