YSR Jalakala: 28న వైఎస్ఆర్ జలకళ ప్రారంభం... రైతులకు అవి ఫ్రీ...

YSR Jalakala in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ఏంటో, రైతులకు ఏం కలిసొస్తుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 23, 2020, 9:07 AM IST
YSR Jalakala: 28న వైఎస్ఆర్ జలకళ ప్రారంభం... రైతులకు అవి ఫ్రీ...
28న వైఎస్ఆర్ జలకళ ప్రారంభం... రైతులకు అవి ఫ్రీ...
  • Share this:
YSR Jalakala in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... అభివృద్ధి కంటే... సంక్షేమంపై ఎక్కువ ఫోకస్ పెడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే... ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. తాజాగా... మరో అతి పెద్ద పథకమైన వైఎస్‌ఆర్ జలకళను సెప్టెంబర్ 28న ప్రారంభిస్తోంది. ఈ పథకానికి పెట్టిన పేరును బట్టీ... ఇది జలానికి సంబంధించినదని మనకు అర్థం అయిపోతుంది. ఇదేంటంటే... ఏపీలో చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా... ఫ్రీగా బోర్లు తవ్విస్తుంది ప్రభుత్వం. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సీఎం 28న జెండా ఊపి ప్రారంభిస్తారు.

రైతులు ఇలా చెయ్యాలి:

పథకం ప్రారంభమయ్యాక... తమకు బోర్ కావాలనుకునే రైతులు... ప్రత్యేక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ని కూడా 28నే సీఎం జగన్ ప్రారంభిస్తారు. దరఖాస్తును పరిశీలించి... భూగర్భ అధికారులు... రైతు పొలం దగ్గరకు వెళ్తారు. భూ గర్భంలో ఎక్కడ నీరు ఎక్కువ ఉందో టెక్నికల్ పరికరాల ద్వారా గమనిస్తారు. ఆ తర్వాత... అక్కడ బోర్ వేస్తే... రైతుకి పొలానికి కావాల్సినంత జలం వస్తుందా, అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది గమనిస్తారు. అంతా సెట్ చేసుకున్నాక... రైతును ఓసారి అడుగుతారు. రైతు సరే అనగానే... బోర్ రిగ్ వాహనం వచ్చేస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున బోర్ తవ్వేస్తుంది. పాతాళ గంగ పైకి ప్రవహిస్తూ... రైతు పొలాల్ని సస్యశ్యామలం చేస్తుంది.

ఇదంతా ఒక్క రోజులో అయిపోదు. బోర్ తవ్వేందుకు టైమ్ పడుతుంది. అప్లై చేసుకున్న చిన్న సన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనం తప్పక లభించాలనీ, అందుకు పూర్తి వాతావరణం కల్పించాలని సీఎం జగన్... అధికారులను, జిల్లా యంత్రాంగాల్నీ ఆదేశించారు.

బోర్ కోసం అప్లై చేసుకునే రైతులు... ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ విధానం లేకపోతే... MPDOల ద్వారా నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్‌ విభాగపు డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు. అందువల్ల తమకు వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యడం తెలియదనుకునే రైతులు... MPDOలను కలిసి సమస్య చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే ఈ పని పూర్తి కావాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరైనా అధికారులు లంచం అడిగితే... రైతులు కంప్లైంట్ ఇవ్వొచ్చు.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading