Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT TO INTRODUCE NEW SYSTEM TO PAY STAMP DUTIES IN REGISTRATIONS DEPARTMENT FULL DETAILS HERE PRN

AP News: ఏపీలో రిజిస్ట్రేషన్లు మరింత ఈజీ.. గంటల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు.. సర్కార్ కొత్త ఆలోచన..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆస్తుల క్రయ, విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానంలో లావాదేవీలు జరిపేవారు డాక్యుమెంట్ రైటర్ల సహకారంలో బ్యాంకులో చలానాల ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆస్తుల క్రయ, విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానంలో లావాదేవీలు జరిపేవారు డాక్యుమెంట్ రైటర్ల సహకారంలో బ్యాంకులో చలానాల ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దీని వల్ల బ్యాంకుల్లో ఎదురుచూడాల్సి రావడం, రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతుండటంతో సమయం వృథా అవుతోంది. ఈ సమస్యను అధిగమించి మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రబుత్వం సరికొత్త ఆలోచన చేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుకు విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త విధానంలో స్టాంప్‌ వెండర్లు, గ్రామ/వార్డు సచివాలయాలు (Village Secretariats) , కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో ఆన్‌ లైన్‌లోనే చార్జీలను చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది.

    తొలుత ప్రయోగాత్మకంగా కొందరు స్టాంప్ వెండర్ల వద్ద ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 71 మందిని ఎంపిక చేసి వారికి అవకాశమిచ్చారు. వీరికి స్టాంప్‌ డ్యూటీ ఆథరైజ్డ్‌ కలెక్షన్‌ సెంటర్‌ (ఏసీసీ) పర్మిషన్లు ఇచ్చారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. వినియోగదారులు బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్టాంప్ వెండార్ల వద్దే స్టాంప్ డ్యూటీని చెల్లించవచ్చు. వాటి రశీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

    ఇది చదవండి: బెజవాడ అంటే ఆ మాత్రం ఉండాలి.. ధోనీ బర్త్ డేకి భారీ కటౌట్.. ఫ్యాన్స్ రచ్చరచ్చ..


    స్టాంప్ వెండార్లతో పాటు గ్రామ/వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అనుసంధానం చేస్తారు. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో ఒఫ్పందం చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కట్టించుకునేందుకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది.



    ఇందులో భాగంగా ఏ రోజు వచ్చిన ఛార్జీలను ఆ రోజే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు విలువైన సమయం ఆదా అవడంతో పాటు నకిలీ చలానాల బెడత తప్పుందని ప్రభుత్వం భావిస్తోంది. మరో నెలరోజుల్లో స్టాంప్ డ్యూటీ స్టాంప్ వెండర్ల వద్దే చెల్లించే విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వం త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయించేలా ఏర్పాటు చేస్తుండటంతో ఈ నూతన విధానాన్ని ఆయా కార్యాలయాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలుత ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లోనే ఈ విధానాన్ని పరీక్షించాలని భావించినా సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Registrations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు