హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Bar Policy: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?

AP New Bar Policy: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యపానం నిషేదం (Liquor Ban) పై ప్రభుత్వం దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రైవేట్ మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమై వైన్ షాపులను తెరిచింది.

  Anna Raghu, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యపానం నిషేదం (Liquor Ban) పై ప్రభుత్వం దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రైవేట్ మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమై వైన్ షాపులను తెరిచింది. అలాగే మద్యం షాపుల సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ధరలు పెంచింది. ఐతే దీనిపై వ్యతిరేకత రావడం, నాటుసారా, అక్రమ మద్యం పెరిగిపోవడంతో ధరలు తగ్గించింది. తాజాగా కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం 2017-22 మధ్య కాలానికి గత ప్రభుత్వం రూపొందించిన బార్ పాలసీ అమల్లో ఉంది. తాజాగా దీనిలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

  ప్రస్తుతమున్న విధానం జూన్ తో ముగుస్తుండటంతో జూలై నుంచి కొత్తపాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 840 బార్లున్నాయి. వైన్ షాపుల మాదిరిగానే ఈ సంఖ్యను తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే బార్ల సంఖ్య అలాగే ఉంచి.. లైసెన్స్ ఫీజును భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం ప్రభుత్వం మూడు శ్లాబుల్లో బార్ల లైసెన్స్ ఫీజును వసూలు చేస్తోంది.

  ఇది చదవండి: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!


  50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలు, 50వేల నుంచి 3లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.20 లక్షలు, 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు ఫీజుగా నిర్ధారించారు. ఐతే ఈ ఫీజులను ప్రాంతాలకనుగుణంగా దాదాపు రెట్టింపు చేసే ఛాన్సుంది. 50వేల లోపు జనాభా ఉంటే రూ.20 లక్షలు, 50వేలు-3లక్షల లోపు జనాభా ఉంటే రూ.30 లక్షలు, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలకు లైసెన్స్ ఫీజు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  ఇది చదవండి: ముగిసిన సీఎం దావోస్ టూర్.. 10రోజుల తర్వాత రాష్ట్రానికి జగన్..


  ఐతే ఈ లైసెన్స్ ఫీజు ఐట్ పరిధిలోకి రాకుండా.. లైసెన్స్ ఫీజును తక్కువగా చూపిస్తూ.. నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని ఎక్కువగా చూపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే దీనిపై ఏడాదికి 10శాతం చొప్పున ఛార్జీలు పెంచుతారు. దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో లైసెన్స్ ఫీజులు మరింత పెరిగే ఛాన్సుంది.

  ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


  బార్ పాలసీకి ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండటం జూన్ రెండోవారానికల్లా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక, లైసెన్స్ జారీ ప్రక్రియ ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో అప్పటికే ఉన్న బార్లను కొత్త లైసెన్స్ ఫీజు వసూలు చేసి రెన్యువల్ చేసేవారు కానీ ఇప్పుడు అన్నీబార్లకు కొత్తగా అప్లికేషన్లు తీసుకొని అనుమతులు జారీ చేయనున్నారు.

  ఇది చదవండి: ర‌ఘురామ‌ కృష్ణంరాజు కుర్చీ వెనుకున్న కండువా క‌థేంటీ..? ఆ పార్టీకి సంకేతాలిస్తున్నారా..?


  రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. బార్లకు స్వస్తిపలికేందుకు చర్యలు తీసుకుంది. అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే అంటే 2019 నంవబర్లోనే కొత్తపాలసీకి శ్రీకారం చుట్టింది.. కానీ తమకు ఐదేళ్ల పాటు లైసెన్స్ ఉంది.. 2022 వరకు కదలించడానికి వీల్లేదంటూ బార్ల యజమానులు కోర్కుకెక్కారు. దీంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో కొత్తపాలసీపై జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరి వైన్ షాపుల మాదిరిగానే బార్ల సంఖ్యను కూడా తగ్గిస్తుందా..? లేక బార్లను అలాగే ఉంచి లైసెన్స్ ఫీజును భారీగా పెంచడం ద్వారా వాటి సంఖ్య తగ్గేలా చేస్తుందా..? అనేది వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Liquor policy

  ఉత్తమ కథలు