Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT TO IMPLEMENT SECOND PHASE OF YSR KAPU NESTHAM ON JULU 22ND FULL DETAILS HERE PRN GNT

YSR Kapu Nestham: మరో పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం.. వారి ఖాతాలో రూ.15వేలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) మరో పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది.

    రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపునేస్తం అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేయనుంది. అర్హులైన మహిళల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 3,27,244 మంది పేద మహిళలకు రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది చేకూర్చనుంది.

    గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు సాయం చేయగా... ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 68,95,408 మంది కాపు వర్గానికి చెందిన లబ్ధిదారులకు 15 రెట్లు ఎక్కువగా అంటే రూ.12,156.10 కోట్ల లబ్ది చేకూర్చినట్లు వెల్లడించింది.

    ఇది చదవండి: ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు...! బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ చేతికి..


    ఈనెల మొదటి వారం నుంచి కాపు నేస్తంపై సర్వే జరిపిన ఏపీ ప్రభుత్వం.. వార్డు వాలంటీర్లు ద్వారా అర్హుల వివరాలను సేకరించింది. అనంతరం గ్రామ సచివాలయాల్లో అబ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుదిజాబితాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. దీంతో 3,27,244 అర్హులగా తేల్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కమ్మ,రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏడాది ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.  లబ్ధిదారుల విషయంలో ఇప్పటికే అంచనాలు రూపొందించింది.

    ఇది చదవండి: ఏపీలోని ఈ మండలాల్లో హై అలర్ట్.. లాక్ డౌన్ తప్పదేమో..!


    ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం.. అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాపులతో పాటు అన్ని ఓసీ వర్గాలకు చెందిన వారు రూ.8లక్షల లోపు ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ వర్తించనుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kapu Reservation, YSR Kapu Nestham

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు