Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT TO IMPLEMENT 2ND PHASE OF YSR ASARA SCHEME ON OCTOBER 7TH FULL DETAILS HERE PRN GNT

AP Government Scheme: మహిళలకు సీఎం జగన్ మరో కానుక... 87లక్షల మంది ఖాతాల్లోకి నగదు

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా మహిలలకు (Dwakra Groups) అందించే వైఎస్‌ఆర్‌ ఆసరా (YSR Asara Scheme) రెండో విడత కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది.

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో పథకాన్ని (AP Government Schemens) అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా మహిలలకు అందించే వైఎస్‌ఆర్‌ ఆసరా (YSR Asara Scheme) రెండో విడత కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 7న ప్రకాశం జిల్లా (Prasakasham District) ఒంగోలులో జరగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేతులమీదుగా ప్రారంభం కానుంది. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల మందికి లబ్ది చేకూరేలా రూ.6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయనుంది. ఎన్నికల రోజు వరకూ అనగా 11.04.2019 నాటికి పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తానని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందని ప్రఙుత్వం తెలిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరినీ రుణ విముక్తుల్ని చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి, ఇచ్చిన మాట ప్రకారం 11.04.2019 ఎలక్షన్‌ తేదీ నాటికి సుమారు 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87,74 లక్షల మందికి ఉన్న అప్పు నిల్వ రూ. 27,168 కోట్లను 4 విడతలలో చెల్లిస్తానని చెప్పి మొదటి విడత 11.09.2020 నాడు రూ. 6,792 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

  ఇది చదవండి: డ్రగ్స్ మాఫియా వెనుక ఆ పార్టీ నేతల హస్తముందా..? ఆ ఆరోపణల్లో నిజమెంత..?


  మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా గత ఏడాది అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది అజియో – రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర – ఖేతి వంటి బహుళ జాతి సంస్ధలతో ఒప్పందాలు చేసుకుని మహిళలకు వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి బాటలు వేస్తున్నట్లు పేర్కొంది.

  ఇది చదవండి: ఏపీకి అలర్ట్... ఈ నెలలో మరో రెండు తుపాన్లు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...


  మహిళాభివృద్ది ద్వారానే కుటుంబాభివృద్ది జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, పేదింటి ఆడపిల్లలలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి నాడు – నేడు, ఇంగ్లీష్‌ మీడియం, ఇళ్ళ పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో, అన్ని నామినేటెడ్‌ పోస్ట్‌లలో 50 శాతం మహిళలకు కేటాయించడం, వృద్దాప్య మరియు వితంతు పింఛన్లు, మహిళల రక్షణకు దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్ల వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap welfare schemes

  తదుపరి వార్తలు