Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT TO GIVE AGRICULTURAL MACHINERY ON SUBSIDY PRICES TO FARMERS IN THE STATE FULL DETAILS HERE PRN

AP Government: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త.. 50 శాతం సబ్సిడీతో కొత్త పథకం.. వివరాలివే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ (YSR Rythu Bharosa-PM Kisan) పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల (Rythu Bharosa Kendras) ద్వారా నాటు వేసినప్పటి నుంచి పంట విక్రయించేవరకు అన్ని పనులను చక్కబెడుతోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ (YSR Rythu Bharosa-PM Kisan) పేరుతో అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల (Rythu Bharosa Kendras) ద్వారా నాటు వేసినప్పటి నుంచి పంట విక్రయించేవరకు అన్ని పనులను చక్కబెడుతోంది. అలాగే కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్రపరికరాలను అందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం.. రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలను అందేంచేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు, వారి పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవహాయ యంత్ర పరికరాలను అందిస్తోంది.

    తాజాగా వ్యక్తిగతంగానూ యంత్రపరికరాలను రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 50శాతం సబ్సిడీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 కోట్ల అంచనా వ్యవయంతో ఆర్బీకే స్థాయిలోనే రూ.6లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల విలువైమ 10,750 వైఎస్ఆర్ యంత్రసేవా కేంద్రాలు, వరి ఎక్కువ పండించే ప్రాంతాల్లో రూ.10 లక్షల సబ్సిడీతో రూ.25లక్షలు విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన 1,615 క్లస్టర్ లెవల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల వ్యయంతో 6,781 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ యంత్రసేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలై రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో రూ.3,800 ట్రాక్టర్లను రైతులకు అందించిన ప్రబుత్వం.. వీటికి అదనంగా యంత్ర పరికరాలను అందించనుంది.

    ఇది చదవండి: మీ పిల్లల ఆధార్ అప్ డేట్ కాలేదా..? ఈజీ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్..!


    రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసిన ప్రభుత్వం మొత్తం లక్షా 80వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిచింది. వీరిలో అత్యధికంగా 34శాతం మంది పురుగు ముందులు చల్లేందుకు స్ప్రేయర్లు కావాలని కోరారు. 25 శాతం మంది టార్పాలిన్సు, 15శాతం మంది భూమిని చదును చేసేందుకు కల్టివేటర్ల వంటి పరికరాలు కావాలన్నారు. 12 శాతం మంది.. సెల్ప్‌ ప్రొపెల్డ్‌ ఇంప్లిమెంట్స్‌ 9 శాతం మంది రోటోవేటర్స్, 4 శాతం మంది సీడింగ్‌ పరికరాలు ఒక శాతం మంది మిస్క్‌ ఎక్విప్‌మెంట్‌ కావాలన్నారు.

    ఇది చదవండి: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై కొత్త తరహా రవాణా.. త్వరలోనే మీముందుకు..!


    ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం గ్రామానికి 25 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 68వేల మందిని ఎంపిక చేసి రూ.15వేల విలువైన వ్యవసాయ యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే గ్రామానికి 8 మంది చొప్పున మొత్తం 80 వేల మందికి రూ.50వేల విలువన రెండు యూనిట్లను 50శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం మొత్త రూ.403 కోట్లు ఖర్చు చేయనుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Farmers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు