ఏపీ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం... ప్రజలకు మేలు...

Andhra Pradesh : మార్చి 1న ఒకే రోజున 60 లక్షల పెన్షన్ల పంపిణీ పూర్తవడంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: March 3, 2020, 5:58 AM IST
ఏపీ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం... ప్రజలకు మేలు...
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
Andhra Pradesh : ప్రజలకు వీలైనన్ని ఎక్కువ సేవలు, వీలైనంత ఈజీగా అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా... ఇకపై గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మరిన్ని అదనపు సేవలు అందించబోతున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో... ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విషయం అలా ఉంచితే... ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, ప్రొఫార్మాలను సచివాలయాలకు పంపిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రజలు మీ సేవ కేంద్రాల ద్వారా పొందిన చాలా సేవల్ని ఇకపై గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తున్నారు. అందువల్ల మీసేవకు వెళ్లి డబ్బులు చెల్లించే పని లేకుండా... ఆ సేవల్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఈ కారణంగానే కొత్త ధ్రువీకరణ పత్రాల్ని జారీ చేస్తున్నా్రు. ప్రస్తుతం గ్రామాల్లో 2000 మంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం, నగరాల్లో 4000 వేల మందికి ఓ వార్డు సచివాలయం, గిరిజన ప్రాంతాలు, తండాల్లో 2000 కంటే తక్కువ జనం ఉన్నా... అక్కడ కూడా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్, పట్టణాల్లో ప్రతి 50 నుంచీ 100 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున నియమించిన ప్రభుత్వం... జనవరి 26, 2020 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఐతే... ఈ సేవలు మరీ ఆశించినంతగా లేవనీ, లేటవుతున్నాయనే వాదన క్షేత్రస్థాయిలో ఉంది. ఇది ప్రారంభంలోనే కాబట్టి... మున్ముందు అలవాటై... వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం అనుకుంటోంది. అందుకే... దీన్ని మరింత పెంచేందుకు మరిన్ని సేవలు వీటి ద్వారానే అందించాలనుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 11162 గ్రామ సచివాలయాలు, 3842 వార్డు సచివాలయాల వివరాల్ని కంప్యూటర్లలో ఎక్కించారు. అందువల్ల వీటి ద్వారా ఆన్‌లైన్ సర్వీసులు అందించే వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన సేవల పత్రాలు... ఆయా సచివాలయాలకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ మీ సేవ ద్వారా ఈ సర్టిఫికెట్లు వచ్చేవి. ఇప్పుడు GWSA అక్షరాలతో ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లను జారీ చేయబోతోంది. వీటిపై జగన్ నవరత్నాల ఫొటో, హాలోగ్రామ్ ఉంటాయి.

మొదట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈ-సేవ అనే విధానాన్ని తెచ్చారు. దాని ద్వారా ప్రభుత్వ సేవలన్నీ అందించే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి... దాన్ని మీ సేవగా పేరు మార్చారు. ఆ తర్వాత 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ... మీ సేవను కొనసాగించింది. ఇప్పుడు వైసీపీ వాటిని కొనసాగిస్తున్నా... అవి తమ ఘనతగానే టీడీపీ చెప్పుకుంటోంది. అందుకే... మీ సేవకు ఫుల్ స్టాప్ పెట్టి... ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్ని బలంగా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా ఇది టీడీపీకి ఇబ్బందికర పరిణామమే. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో... టీడీపీకి ఎలాంటి క్రెడిట్టూ దక్కకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం... ఇప్పుడు మీ సేవ ద్వారా కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
First published: March 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading