Andhra Pradesh: నోరూరించే చేపలు, రొయ్యలు, పీతలు ఇకపై మీ ఇంటికే వస్తాయి.. అది ఎలాగంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ఆదివారం వస్తే మాంసాహార ప్రియులు చేపల మార్కెట్ కు వెళ్లి తమకు నచ్చివాటిని తెచ్చుకొని ఆరగిస్తుంటారు. ఇప్పుడు మార్కెట్ వరకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

  • Share this:
    మాంసాహార ప్రియులు చేపలు, రొయ్యలు, పీతలు అంటే పడిచస్తారు. ఆదివారం వస్తే చాలు మార్కెట్ కు వెళ్లి తమకు నచ్చివాటిని తెచ్చుకని ఆరగిస్తుంటారు. ఇప్పుడు మార్కెట్ వరకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఇంటికే చేపలు, రొయ్యలు వచ్చేస్తాయి. ఇదేదో ఆన్ లైన్ ఫిష్ డెలివరీ యాప్ చేస్తున్న పనికాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే త్వరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్న ఆక్వా హబ్ ల ద్వారా ఇంటి వద్దకే ఆక్వా ఉత్పత్తులను తీసుకురానుంది. మంచి పోషక విలువలున్న మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడం కోసం ఏపీ ప్రభుత్వం రూ.325.15 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా హబ్ లు ఏర్పాటు చేసి తోపుడు బండ్లపై కూరగాయలు విక్రయించినట్లుగా చేపలు, రొయ్యలు, పీతలు వంటి మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసుకొచ్చి విక్రయించనున్నారు.

    ఆక్వా హబ్ లు, ఫిష్క్ కియోస్క్ లు, రిటైల్ అవుట్ లెట్స్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కమ్ ఫుడ్ కార్డులు, ఈ-రిక్షాలు, వాల్యూ యాడెడ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చేపలు, రొయ్యల వంటి అక్వా ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులను కూడా ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

    ఇది చదవండి: భార్యను చంపబోయిన భర్త... 8 నిముషాల్లోనే కాపాడిన దిశ...



    రాష్ట్రంలో ప్రస్తుతం 46.23 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. స్థానికంగా కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు. కాగా తలసరి వినియోగం 8.07 కిలోలుగా ఉంది. 2025 నాటికి స్థానిక వినియోగాన్ని 30శాతానికి పెంచడమే కాకుండా.. తలసరి వినియోగాన్ని 22.88 కిలోలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆక్వా రైతులు, మత్స్యకార కో-ఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 100 ఆక్వా హబ్ లు ఏర్పాటు చేస్తోంది.

    ఇది చదవండి: పెళ్లైన ఆరేళ్ల తర్వాత కలిసిన టీనేజ్ లవర్... ప్రియుడ్ని విడిచి ఉండలేని భార్య... పక్కా ప్లాన్ తో భర్తను ఏం చేసిందంటే...


    ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ ఆక్వా హబ్ ల నుంచి లైవ్ ఫిష్, డ్రై ఫిష్, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలను జనతా బజార్లు, రిటైల్ పాయింట్లకు తరలించేందుకు సప్లై చేన్ రూపించారు. ఒక్కో ఆక్వా హబ్ పరిధిలో ఒక వాల్యూయాడెడ్ యూనిట్ తో పాటు ఐదు లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, 10 ఫిష్ వెండింగ్ కార్డులు, 8 కియోస్క్ లు, రెండు ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ కార్డులు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి గ్రామ సచివాలయానికి 100 చొప్పున మినీ రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఆక్వా హబ్ పరిధిల రోజుకు 15 టన్నుల ఉత్పత్తులను సరఫరా చేస్తారు. తొలి విడతలో 25 ఆక్వా హబ్ లను ప్రారంభించనున్న ప్రభుత్వం.. వచ్చే ఏడాది జనవరి 26నాటికి మిగిలిన 75 ఆక్వా హబ్ లను ప్రారంభించనుంది.

    ఇది చదవండి: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ ఏపీ..? కేంద్రం గెజిట్ తో సీమకు ఒరిగేదేం లేదా..?


    Published by:Purna Chandra
    First published: