హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: దుర్గగుడి ఈవోపై వేటు... ఆలయంలో అవినీతి ఎఫెక్ట్.. కొత్త ఈవో ఎవరంటే..!

Andhra Pradesh: దుర్గగుడి ఈవోపై వేటు... ఆలయంలో అవినీతి ఎఫెక్ట్.. కొత్త ఈవో ఎవరంటే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గగుడిలో (Vijayawada Durga Temple) అవితీని వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గగుడిలో (Vijayawada Durga Temple) అవితీని వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గగుడిలో (Vijayawada Durga Temple) అవితీని వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గగుడి (Vijayawada Durga Temple) లో అవితీని వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆలయంలో ప్రక్షాళనకు దిగిన ప్రభుత్వం తీవ్రఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో సురేష్ బాబుపై వేటు వేసింది. ఆయన స్థానంలో భ్రమరాంభను నూతన ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్ బాబును దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆలయంలోని దర్శన టికెట్ కౌంటర్లు, స్టోర్స్, చీరల కౌంటర్లు, అన్నదానం సత్రం విరాళాలు, వెండి సింహాల మాయం, సెక్యూరిటీ సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించిన టెండర్లలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఈవో సురేష్ బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆలయంలో అవితీనికి సురేష్ బాబే కేంద్ర బిందువని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది.

  ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియలో కొటేషన్లను లీక్ చేసి మ్యాక్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడైంది. అమ్మవారి రథంపై వెండి సింహాల మాయం ఘటనలో మ్యాక్స్ సంస్థ వైఫల్యం సప్ష్టంగా కనిపించింది. ఇక శానిటేషన్ సిబ్బంది నియామకంలో ఎల్-3గా నిలిచిన సంస్థకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టగా.. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.

  ACB Raids Kanaka Durga Temple, Durga Temple, Indrakeeladri, Durga Temple news, Vijayawada Durga Temple, Kanaka Durgamma, Vijayawada, Andhra Pradesh endowment Department, Anti-Corruption bureau, AP Endowment Department, Durga Temple EO Suresh Babu, Andhra Pradesh Government, AP Government, Vijayawada News, Andhra Pradesh news, Ap news, Telugu news, కనకదుర్గ ఆలయంలో ఏసీబీ దాడులు, దుర్గగుడి, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయం, కనకదుర్గ ఆలయం, విజయవాడ దుర్గగుడి, కనకదుర్గమ్మ, విజయవడా, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, అవినీతి నిరోధక శాఖ, ఏపీ దేవాదాయ శాఖ, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, విజయవాడ న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, Andhra Pradesh Government, Durga Temple EO Transferred, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దుర్గగుడి ఈవో బదిలీ
  దుర్గగుడి ఈవోపై బదిలీ వేటు

  దర్శనం, ఆర్జిత సేవలు, ఫోటోల అమ్మకాల కౌంటర్లలో రికార్డ్ అసిస్టెంట్లు అవకతవకలు పాల్పడటంతో సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. ఇక అన్నదానానికి సంబంధించిన వ్యవహారాల్లో అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది. అన్నదానానికి భక్తుల నుంచి వచ్చిన రూ.54లక్షల విరాళాలు లెక్కచూపనట్లు తెలుస్తోంది. కూరగాయలు, ఇతర సరుకులు, గ్యాస్ సిలెండర్ల కోనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. కొనుగోలు చేసిన సరుకులకు.. చెల్లించిన బిల్లులకు పొంతన లేకపోవడంతో భారీగా నిధులు దారిమళ్లినట్లు వెల్లడైంది.

  ఎలాంటి టెండర్లు లేకుండానే సంగం డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు తేలింది. ఆలయానికి సబంధించిన తాళాల నిర్వహణ కూడా సరిగా లేనట్లు అధికారులు తేల్చారు. గతంలో ఈవో సురేష్ బాబుపై 16 అంశాలతో కూడిన నివేదికను దేవాదాయ శాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై ఉద్యోగం చేస్తూ అమ్మవారి సొమ్మును దోచుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

  First published:

  Tags: Andhra pradesh news, AP News, Durga temple, Telugu news, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు