Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT SUSPENDED AB VENKATESHWARA RAO CHIEF SECRETARY ISSUES ORDERS AK

AB Venkateshwara Rao: మరోసారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. పోస్టింగ్ ఇచ్చిన కొద్దిరోజులకే..

ఏబీ వెంకటేశ్వరరావు (ఫైల్)

ఏబీ వెంకటేశ్వరరావు (ఫైల్)

AB Venkateshwara Rao: కొద్దిరోజుల క్రితమే ఆయనను విధుల్లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆయనను మరోసారి సస్పెండ్ చేసింది.

    ఏపీ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateshwara Rao) షాక్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితమే ఆయనను విధుల్లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆయనను మరోసారి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్(AP Chief Secretary) ఉత్తర్వుల జారీ చేశారు. సుదీర్ఘకాలం న్యాయపోరాటం తరువాత ఇటీవల ఆయనను విధుల్లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం(Ap Government)..కొద్దిరోజుల క్రితమే ఆయనకు ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా పోస్టింగ్ కూడా ఇచ్చింది. అయితే క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై సస్పెన్షన్ వేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1969 ఆలిండియా సర్వీస్ రూల్ 3, సబ్ రూల్ 3 ప్రకారం సస్పెన్షన్ వేటు వేసింది.

    ఇక పది రోజుల క్రితమే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా మూడేళ్ల అనంతరం తిరిగి బాధ్యతలు స్వీకరించారు ఏబీ వెంకటేశ్వరరావు. తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమిస్తూ జూన్ 15, బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏబీవీకి ఈ నిర్ణయంతో ఊరట కలిగినట్టయ్యింది.

    నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయన మీద కేసు నమోదు చేసింది. ఆయనను సస్పెండ్ చేసింది.



    తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తన మీద విధించిన సస్పెన్షన్‌ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తన మీద విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.

    AP Farmers: ఆంధ్రా అన్నపూర్ణకి విత్తనాల కొరత..! క్రాప్ హాలిడేతో సగానికి పైగా సాగుపై సందిగ్ధం..!

    Godavari River: ఏడారిలా గోదారి.. ఆ రెండు జిల్లాలకు భవిష్యత్తులో కష్టాలు తప్పవా..?

    రెండేళ్ల‌కు పైబ‌డి ఐపీఎస్ అధికారుల‌ను స‌స్పెన్ష‌న్‌లో పెట్ట‌రాద‌న్న నిబంధ‌న‌ను ప్ర‌స్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఏబీవీ ఏపీ ప్ర‌భుత్వంపై విజ‌యం సాధించారు. ఏబీవీ స‌స్పెన్ష‌న్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలంటూ ఆయ‌న‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఇచ్చిన కొద్దిరోజులకే ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: AB venkateshwara rao, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు