ANDHRA PRADESH GOVERNMENT STARTED MASS SCREENING TO PREVENT CANCER IN THE STATE FULL DETAILS HERE PRN
AP Cancer Treatment: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి ముందుకే క్యాన్సర్ టెస్టులు..
సీఎం జగన్ (ఫైల్)
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆరోగ్య శ్రీ (ArogyaSri) పేరుతో రెండువేలకు పైగా జబ్బులకు ఉచిత ట్రీట్ మెంట్ అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధులపై దృష్టిపెట్టింది.
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆరోగ్య శ్రీ (ArogyaSri) పేరుతో రెండువేలకు పైగా జబ్బులకు ఉచిత ట్రీట్ మెంట్ అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధులపై దృష్టిపెట్టింది. కరోనా, డెంగ్యూ వంటి రోగాలను ఇప్పటికే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసికొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్యాన్సర్ మహమ్మారిపై దృష్టి పెట్టింది. గుండెపోటు తర్వాత అత్యంత ప్రమాదకరంగా మారన క్యాన్సర్ పై యుద్ధం చేయనుంది. క్యాన్సర్ ట్రీట్ మెంట్, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును క్యాన్సర్ కేర్ సలహాదారుగా నియమించింది.
ప్రారంభదశలోనే గుర్తించడం వల్ల నివారణఖు ఆస్కారం ఉంటుదన్న నోరి దత్తాత్రేయుడు సలహాతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్ ను జగన్ సర్కార్ మొదలుపెట్టింది. దీని ద్వారా నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందించనుంది.
క్యాన్సర్ మాస్ స్క్రీనింగ్ ను గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. తుళ్లూరు మండలం దొండపాడులో ఇప్పటికే టెస్టులు మొదలయ్యాయి. గ్రామసచివాలయం యూనిట్ గా చేసుకొని మొబైల్ మెడికల్ యూనిట్ సాయంతో టెస్టులు నిర్వహించనుంది. ఇందులో ముగ్గురు అంకాలజీ డాక్టర్లు, ముగ్గురు గైనకాలజీ నిపుణులు ఉంటారు.
దొండపాడు గ్రామంలో దాదాపు 250 మంది స్క్రీనింగ్ కు ముందుకురాగా.. వారిలో 70 మంది బ్రెస్ట్ క్యాన్సర్ అనానిత లక్షణాలు కనిపించాయి. 117 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కనిపించగా... ఇద్దరు పురుషులకు నోటి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. వీళ్లందిరినీ పరీక్షించిన వైద్యులు.. మొబైల్ యూనిట్ లోనే మామోగ్రామ్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించి పాప్ స్మియర్ టెస్టులు చేసి రిపోర్టులను గుంటూరు జీజీహెచ్ లోనే నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి పంపారు. జీజీహెచ్ లో పరీక్షించిన అనంతరం బయాప్సీ ద్వారా క్యాన్సర్ నిర్ధారిస్తారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా గుర్తించిన అంశాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ నిర్ధారణ మాస్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడతారు. సచివాలయ యూనిట్ గా పరీక్షలు చేయడం వల్ల గ్రామంలో ఉండే ఏఎన్ఎం, ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించే వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ టెస్టుల ద్వారా క్యాన్సర్ గుర్తించిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించనుంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.