ANDHRA PRADESH GOVERNMENT SERIOUS ON EMPLOYEES STRIKE THINK ABOUT EMSA ON SOME EMERGENCY DEPARTMENT NGS GNT
AP Employees Strike: ఏపీ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర.. ఎస్మా దిశగా అడుగులు.. ఏఏ శాఖలపై..
వైఎస్ జగన్ (ఫైల్)
AP Employees Strike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఖరి అస్త్రం సంధించేందుకు సిద్ధమైందా...? మంత్రుల కమిటీ ఇన్నిరోజులు ఎదురు చూసినా.. ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడంతో సీరియస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైందా..? మరి ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి..?
AP Employees Strike: ఆంధ్రప్రదేశ (Andhra Pradesh) లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల పోరు తారీ స్థాయికి చేరింది. ఇక ఎదురు చూపులు లేవని మంత్రులు కమిటీ తేల్చి చెప్పేసింది.. పీర్సీసీ (PRC) జీవోలు వెనక్కు తీసుకోవడం.. లేదా జనవరిలో పాత జీతాలు ప్రాసెస్ చేస్తేనే చర్చలలకు వస్తామని ఉద్యోగ సంఘాలు పట్టు పడుతున్నాయి. దీంతో ఇక చర్చలు లేనట్టే.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు (Employees Union) గట్టిగా ఫిక్స్ అయ్యాయి.. ఇప్పటికే అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర విభాగాలు సైతం ఉద్యమంలో భాగం అవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Government) కూడా అలర్ట్ అయ్యింది.. అత్యవసర శాఖలు ఉద్యమంలో పాల్గొంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కీలక శాఖలు కూడా సమ్మె లోకి (AP Employees Strike) వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది.
అయితే ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్నట్టు సమాచారం. అత్యవసరమైతేనే ఎస్మా ఉపయోగించాలని అధికారులకు సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ముందుగా సమ్మెను విరమింపచేసే ప్రయత్నాలు చేయలని.. తప్పని సరి పరిస్థితి తలెత్తితే.. అత్యవసర సేవలపై మాత్రమే ఈ ఎస్మా అస్త్రాలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది విద్యుత్ శాఖ.
ఇదీ చదవండి : టీడీపీ చీర్ బాయ్స్ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారా..? ఆ ఇద్దరికీ భారత రత్న ఇవ్వాలన్న మంత్రి
తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని.. సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కు తీసుకోకుండా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఉద్యోగులు నమ్మే పరిస్తితి లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందచేశారు వైద్య, విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఇదే సమంలో మరోవైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌కు సహకరించడం లేదు ఉద్యోగులు.
ఇప్పటి వరకు 4.50 లక్షల బిల్లులకు గానూ.. కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయంటోంది ఆర్థిక శాఖ. పరిస్థితి చేయిదాటకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఉద్యమం నుంచి వెనక్కు తగ్గేదే లేదంటున్నారు ఉద్యోగులు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.. సమ్మె తప్పని సరి అయినప్పుడు.. ఎస్మా బాణం ప్రయోగిస్తుందా.. అంత వరకు పరిస్థితి రాకుండా ముందే దిద్దుబాటు చర్యలు చేపడుతుందా అన్నది తేలాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.