YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రూ.2,000... చెక్ చేసుకోండి ఇలా

YSR Rythu Bharosa payment status | లబ్ధిదారుల పేర్లు గ్రామ సచివాలయాల్లో శుక్రవారం నుంచి ప్రదర్శిస్తారు. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో కూడా డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: January 2, 2020, 5:33 PM IST
YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రూ.2,000... చెక్ చేసుకోండి ఇలా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైతులందరికీ ప్రభుత్వం కొత్త సంవత్సరం రోజున శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లబ్ధిదారులకు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు చెందిన డబ్బులు రూ.2,000 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి చెందిన డబ్బుల్ని రైతు భరోసా పథకంలోని లబ్ధిదారులకు బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 46,50,629 మంది ఖాతాలకు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, కౌలు రైతులకు రూ.13,500 జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.11,500 జమ చేసింది. మూడో విడతలో మిగిలిన రూ.2,000 జమ చేస్తోంది. లబ్ధిదారుల పేర్లు గ్రామ సచివాలయాల్లో శుక్రవారం నుంచి ప్రదర్శిస్తారు. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో కూడా డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

YSR Rythu Bharosa: లబ్ధిదారుల పేర్లు చెక్ చేసుకోండి ఇలా



ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అధికారిక వెబ్‌సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Payment Status ట్యాబ్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోవడానికి నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి.

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...

Pension Scheme: నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే ఈ స్కీమ్ గురించి తెలుసా?

LIC: ఎల్ఐసీ నుంచి డబ్బులు రాలేదా? కారణం ఇదే కావొచ్చు
Published by: Santhosh Kumar S
First published: January 2, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading