హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government Holidays-2022: 2022లో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఏ పండుగ ఎప్పుడంటే..!

AP Government Holidays-2022: 2022లో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఏ పండుగ ఎప్పుడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) 2022 సంవత్సరానికి (Calendar Year-2022) గానూ సెలవు దినాలను (AP Govt Holidays) ప్రకటించింది. జనరల్, ఆప్షనల్ సెలవులను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) 2022 సంవత్సరానికి (Calendar Year-2022) గానూ సెలవు దినాలను (Govt Holidays) ప్రకటించింది. జనరల్, ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. వీటిలో ఆరు సాధారణ సెలవులు ఆదివారం రాగా.. మూడు ఆప్షనల్ హాలిడేస్ ఆదివారం వచ్చాయి. దీంతో ఉద్యోగులకు నిరాశ పతప్పేలా లేదు. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత కనుమ, శ్రీరామ నవమి, గాంధీ జయంతి, మిలాదున్ బీ, క్రిస్ట్ మస్ వంటి సాధారణ సెలవులు ఆదివారం వచ్చాయి. అలాగే మహాలయ అవావాశ్య, నరక చదుర్థశి, యాజ్-దహుం-షరీఫ్ వంటి ఆప్షనల్ హాలిడేస్ ఆదివారం వచ్చాయి. మొత్తం తొమ్మిది సెలవులు ఆదివారం రావడంతో ఉద్యోగులకు షాక్ తప్పలేదు.

మరోవైపు రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ నబీ వంటి ముస్లిం పండుగలు, హిందూ పండుగల్లో తిథులను బట్టి మార్పులంటే ముందుగానే ప్రకటిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇది చదవండి: ఏపీలోని ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక


సాధారణ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 14 (శుక్రవారం) – భోగి

జనవరి 15 (శనివారం) – సంక్రాంతి

జనవరి 16 (ఆదివారం)- కనుమ

జనవరి 26 (బుధవారం) – రిపబ్లిక్ డే

మార్చి 1 (మంగళవారం) – మహా శివరాత్రి

మార్చి 18 (శుక్రవారం) – హోలీ

ఏప్రిల్ 2 (శనివారం) – ఉగాది

ఏప్రిల్ 5 (మంగళవారం) – బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 10 (ఆదివారం) – శ్రీరామ నవమి

ఏప్రిల్ 14 (గురువారం) – బి.ఆర్ అంబేద్కర్ జయంతి / మహవీర్ జయంతి

ఏప్రిల్ 15 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే

మే 3 (మంగళవారం) – రంజాన్

జూలై 7 (ఆదివారం) - బక్రీద్

ఆగస్టు 9 (మంగళవారం) – మొహర్రం

ఆగస్టు 15 (సోమవారం) – స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 19 (శుక్రవారం) – శ్రీకృష్ణ జన్మాష్టమి

ఆగస్టు 31 (బుధవారం) – వినాయక చవితి

అక్టోబర్ 2 (ఆదివారం) – మహాత్మా గాంధీ జయంతి

అక్టోబర్ 3 (సోమవారం) – దుర్గాష్టమి

అక్టోబర్ 5 (బుధవారం) – విజయ దశమి

అక్టోబర్ 9 (ఆదివారం) – ఈద్ మిలాదున్ నబీ

అక్టోబర్ 24 (సోమవారం) - దీపావళి

డిసెంబర్ 25 (ఆదివారం) – క్రిస్ట్ మస్

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap government

ఉత్తమ కథలు