ANDHRA PRADESH GOVERNMENT OWN SKOCH NATIONAL AWARD IN RURAL DEVELOPMENT FULL DETAILS HERE PRN GNT
AP Government: ఏపీ ప్రభుత్వానికి అరుదైన ఘనత.. జాతీయ స్థాయిలో పురస్కారం..
ఏపీ ప్రభుత్వానికి జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వ స్కోచ్ ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్'' పురస్కారానికి ఎంపికైంది. వచ్చేనెల 18న ఢిల్లీ (Delhi)లో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా అవార్డు ప్రదానం చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వ స్కోచ్ ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్'' పురస్కారానికి ఎంపికైంది. వచ్చేనెల 18న ఢిల్లీ (Delhi)లో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా అవార్డు ప్రదానం చేయనుంది. కేంద్రం ప్రకటించిన ''స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ -2021''లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలోనే నిలిచిందని.., ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్ -స్కోచ్ అవార్డు''కు ఏపీ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.
స్టార్ ఆఫ్ గవర్నెన్స్ - స్కోచ్ అవార్డుకు ఎపి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందని అన్నారు. గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకువచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు.
పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఎంపిక అవ్వడమని అన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు.
గత ఏడాది జాతీయ పంచాయతీ రాజ్ పురస్కారాల్లోనూ ఏపీ సత్తా చాటింది. 2020 లో రాష్ట్రానికి 15 అవార్డులు రాగా, 2021లో మొత్తం 17 అవార్డులను సొంతం చేసుకుంది. e-పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి.
ఇక ఏపీ పోలీస్ శాఖ కూడా ఈ ఏడాది జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకుంది. నూతన సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం తదితర అంశాల్లో దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో వివిధ విభాగాల్లో 15 అవార్డులను కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డులను గెలుచుకుంది. టెక్నాలజీ సభ అవార్డులలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ 8 అవార్డులు దక్కించుకోగా.., అనంతపురం 1, చిత్తూరు 1, తిరుపతి అర్బన్ 2, కడప ఒక అవార్డు గెలుచుకున్నాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.