అంతర్వేదిలో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్... దర్యాప్తుకి ఆదేశం

Antarvedi Fire Accident: అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? రథాన్ని తగలబెట్టింది ఎవరు? ఇది మనుషుల పనా, ప్రకృతి విపత్తా? నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

news18-telugu
Updated: September 6, 2020, 10:39 AM IST
అంతర్వేదిలో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్... దర్యాప్తుకి ఆదేశం
అంతర్వేదిలో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్... కఠిన చర్యలకు ఆదేశం
  • Share this:
అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లా... అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరగడంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో... వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ గారు నిర్మించిన రథం కాలి బూడిదైంది. దీనిపై మంత్రి వెల్లంపల్లి... దేవాదాయ క‌మిష‌న‌ర్ అర్జున‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే సహాయ చర్యలు చేపట్టామనీ, ఫైరింజన్‌తో మంటల్ని అదుపులోకి తెప్పించామని అధికారులు వివరించారు. దీనిపై పోలీస్, రెవెన్యూ అధికారులు దర్యాప్తు జరపాలంటూ, విచార‌ణ అధికారిగా దేవాదాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్రమోహన్‌ను ఆదేశించారు వెల్లంపల్లి.

ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం పునః నిర్మాణానికి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని దేవాదాయ క‌మిష‌న‌ర్‌కి మంత్రి సూచించారు. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? రథాన్ని తగలబెట్టింది ఎవరు? ఇది మనుషుల పనా, ప్రకృతి విపత్తా? అన్నది దర్యాప్తు తర్వాత తేలనుంది.
Published by: Krishna Kumar N
First published: September 6, 2020, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading