Andhra Pradesh : బ‌డి ఎంపిక వారి ఇష్టం.. ఎయిడెడ్ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ అవకాశం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Andhra Pradesh : ఎయిడెడ్ పాఠ‌శాల‌ (Aided Schools) లో చ‌దువుతున్న విద్యార్థులు వారికి న‌చ్చిన పాఠ‌శాల‌ల‌ను ఎంచుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ఇష్టం మేరే వారు కోరుకొన్న పాఠ‌శాల‌ను వారికి న‌చ్చి ప్ర‌దేశంలో ఎంచుకోనే అవ‌కాశం ఇచ్చింది.

  • Share this:
    ఎయిడెడ్ పాఠ‌శాల‌ (Aided Schools) లో చ‌దువుతున్న విద్యార్థులు వారికి న‌చ్చిన పాఠ‌శాల‌ల‌ను ఎంచుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ఇష్టం మేరే వారు కోరుకొన్న పాఠ‌శాల‌ను వారికి న‌చ్చి ప్ర‌దేశంలో ఎంచుకోనే అవ‌కాశం ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల (Teachers) ను ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల్లో నియమించి విలీన ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించింది. ఎయిడెడ్‌ పాఠశాలలకు సాయం ఆపేసి, అక్కడి ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేసి.. ఆయా పాఠశాలలను ప్రైవేటుగా మార్చాలన్న నిర్ణయంపై ఎంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకొంది. ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించిన విధివిధానాల‌ను అధికారులు ప్ర‌కటించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,882 మంది ఉపాధ్యాయులు ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిలో సుమారు నాలుగు వేలకుపైగా ఉపాధ్యాయులను విద్యాశాఖకు అప్పగించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.

    షెడ్యూల్ వివ‌రాలు..
    - రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ (Notification) జారీ చేసింది.
    - ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థుల (Students)ను ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

    Andhra Pradesh : వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం.. ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం


    - తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతితో అక్టోబ‌ర్ 18, 2021  నుంచి అక్టోబ‌ర్ 31, 2021 వరకు విద్యార్థుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.
    - అక్టోబ‌ర్ 20, 2021 నుంచి అక్టోబ‌ర్ 22, 2021 వరకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు రూపొందించాలి.
    - ఈ జాబితాపై అభ్యంతరాల కోసం 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రదర్శించాలి.
    - అక్టోబ‌ర్ 24, 2021 నుంచి అక్టోబ‌ర్ 27, 2021 వరకు ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలపొచ్చు.
    - జాబితాపై వచ్చిన అభ్యంతరాలను తొలగించి, జిల్లా స్థాయిలో తుది జాబితాను 31న అధికారులు ప్రదర్శించాలి. యాజమాన్యాల వారీ ఖాళీల వివరాలను నవంబరు 1, 2021న పొందుపరచాలి.
    - వెబ్‌ ఆప్షన్ల (Web Options) ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 2, 2021 నుంచి న‌వంబ‌ర్ 5, 2021 వరకు ఉంటుంది.
    - నవంబరు 6, 2021న బదిలీ ఉత్తర్వుల (Circular)ను విద్యాశాఖ విడుదల చేస్తుంది.
    - నవంబరు 7, 2021న బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

    Andhra Pradesh : ఉత్త‌రాంధ్ర‌కు "ఒడిశా కిక్కు".. అక్ర‌మంగా ఎన్‌డీపీఎల్ మ‌ద్యం విక్ర‌యాలు


    అవ‌సంర అయితే కొత్త‌వి..
    ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్యాయుల బదిలీల ద్వారా వీరందరినీ మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాల (Municipal Schools) ల్లో విద్యాశాఖ అధికారుల‌ సర్దుబాటు చేయనున్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది.
    ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కిలోమీటర్‌ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత విద్యార్థులను 3 కిలోమీటర్ల పరిధిలో, ఉన్న‌త‌ పాఠశాల స్థాయి వారిని 5 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలలో సర్దుబాటు చేస్తారు. ఒకవేళ దగ్గర్లో పాఠశాల అందుబాటులో లేకపోతే కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ ఇటీవల ఆదేశించింది. విద్యార్థుల సర్దుబాటు తరువాత ఉపాధ్యాయులను ప్రభుత్వ బడుల్లో విలీనం చేయనుంది.
    Published by:Sharath Chandra
    First published: