HOME »NEWS »ANDHRA PRADESH »andhra pradesh government officials can get salaries on monday nk

Andhrapradesh: ప్రభుత్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... మరికొన్ని గంటల్లో...

Andhrapradesh: ప్రభుత్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... మరికొన్ని గంటల్లో...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... (File)

ఏపీ ప్రభుత్వం తన దగ్గరున్న నిధులను జాగ్రత్తగా వాడుకుంటూ... ఒక్కో సంక్షేమ పథకాన్నీ అమలుచేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    అసలే కరోనా సంక్షోభ కాలం. చేతిలో డబ్బు లేని పరిస్థితి. కట్టాల్సిన ఈఎంఐలు, అప్పులపై వడ్డీలు ఎప్పుడెప్పుడు చేతిలో ఉన్న కాస్త సొమ్మును లాగేసుకుందామా అని ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జులై 5 వచ్చినా... ఇంకా జీతాలు రాలేదు. మామూలుగా అయితే... శనివారం వస్తాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే... జులై 2న గవర్నర్ విశ్వభూషణ్... ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించారు. అదే రోజు బడ్జెట్ అమల్లోకి వచ్చింది. దాంతో... ప్రభుత్వానికి మనీ ఖర్చు పెట్టేందుకు అవకాశం చిక్కింది. మూడో తేదీని వదిలేసి... నాలుగున మనీ జమ చేస్తారని ఉద్యోగులంతా ఎదురుచూశారు. ఎందుకంటే... ఐదో తేదీ ఆదివారం కాబట్టి... ఆ రోజు బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉండవనే ఉద్దేశంతో శనివారమే ఎంతో ఆశగా చూశారు. అలా చూస్తుండగానే... సూరస్తమయం అయిపోయింది.

    ట్రెజరీ కంట్రోల్‌ లేని కొన్ని వేతన బిల్లులను బడ్జెట్‌తో అవసరం లేకుండా ఆర్థికశాఖ కార్యదర్శి విడుదల చేయవచ్చు. కానీ, ఆ బిల్లులను కూడా ఈసారి ఆపారు. ఆదివారం ఎలాగూ మనీ రాదు కాబట్టి... ఇక సోమవారం వస్తుందనే ఆశతో ఉన్నారు ఉద్యోగులు. ప్రభుత్వ వర్గాలు కూడా సోమవారం మనీ జమ అవుతాయనే సంకేతాలు ఇచ్చాయి. కాబట్టి... ఈ నెలలో సోమవారమే ప్రభుత్వ ఉద్యోగులకు పండగ అనుకోవచ్చు. కానీ... ఇలా డబ్బు రాగానే అలా చెల్లించాల్సినవి చాలా ఉంటాయి. అందువల్ల ఈ ఆనందం ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉండదనుకోవచ్చు.

    Published by:Krishna Kumar N
    First published:July 05, 2020, 11:34 IST

    टॉप स्टोरीज