AMRDAకి నోటిఫై... ఏపీ ప్రభుత్వం ఆదేశం... అమరావతిలో ఇక కొత్త చరిత్ర...

AMRDA : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో 1 శాతం కూడా వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాలకు మరింత ఆవేశం పెరిగిపోతోంది. తాజాగా మరో డెవలప్‌మెంట్.

news18-telugu
Updated: August 2, 2020, 11:12 AM IST
AMRDAకి నోటిఫై... ఏపీ ప్రభుత్వం ఆదేశం... అమరావతిలో ఇక కొత్త చరిత్ర...
AMRDAకి నోటిఫై... ఏపీ ప్రభుత్వం ఆదేశం... అమరావతిలో ఇక కొత్త చరిత్ర... (File)
  • Share this:
ఇన్నాళ్లూ మనం ఏపీ... అమరావతికి సంబంధించి CRDA (రాజధాని ప్రాంత అభివృద్ధి అథార్టీ) అనే పదాన్ని ఎక్కువగా విన్నాం. ఇకపై మనకు ఎక్కువగా వినిపించబోయే పదం AMRDA. ఇదేంటంటే... అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీ. పేరు మారడమే కాదు. తీరూ మారుతుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. AMRDAను నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఫలితంగా ఇప్పటివరకూ ఉన్న CRDA... ఇప్పుడు AMRDAలో భాగం అవుతుంది. అంటే... CRDA కంటే... AMRDA పరిధి చాలా పెద్దది, విస్తృతమైనది అని మనం అనుకోవచ్చు.

మొన్న గవర్నర్ విశ్వభూషణ్ అలా సంతకం పెట్టడంతో... CRDA రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చింది. అందువల్ల 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన CRDA ఇప్పుడు చరిత్రలో కలిసిపోయినట్లైంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో చెప్పింది.

AMRDAకి పురపాలక శాఖ కార్యదర్శి... ఉపాధ్యక్షుడుగా ఉంటారు. 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ కూడా ఏర్పాటైంది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి AMRDA కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లావ కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉంటారు. AMRDAకి కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను ప్రభుత్వం నియమించి, దానికో ఆర్డర్ జారీ చేసింది.

ఇక ఇప్పుడు AMRDA అధికారులు... తెల్లారింది మొదలు... అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి. మూడు రాజధానుల్లో భాగంగా... దాన్ని ఎలా తీర్చిదిద్దాలి. అక్కడ రియల్ ఎస్టేట్ మళ్లీ పెరగడానికి ఏం చెయ్యాలి? వంటివి ఆలోచిస్తారు. ఇక దీర్ఘకాలిక ప్లాన్స్‌లో భాగంగా... మెట్రో రైళ్లలు, ఎక్స్‌ప్రైస్ హైవేలు ఇలా చాలా ఉంటాయి. ఐతే... మరీ గాల్లో మేడలు కట్టినట్లుగా ఊహల్లో ప్లాన్స్ కాకుండా... వాస్తవానికి దగ్గరగా, పూర్తయ్యేలా ఉండే ప్లాన్స్ మాత్రమే చెయ్యాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. అసలే అసలు రాజధానిగా అమరావతి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న స్థానికులకు తిరిగి ధైర్యం నింపాల్సిన బాధ్యత ఇప్పుడు AMRDAపై ఉంది.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading