• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT MADE CHANGES IN HOUSING SCHEME TO GET RELIEF FROM FINANCIAL BURDEN HERE ARE FULL DETAILS PRN

Andhra Pradesh: ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక ఎవరిష్టం వారిదే..

Andhra Pradesh: ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక ఎవరిష్టం వారిదే..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) గృహనిర్మాణ పథకంపై (Housing Scheme) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున నిర్మించే ఇళ్ల డిజైన్లను లబ్ధిదారులకే వదిలేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహనిర్మాణ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున నిర్మించే ఇళ్ల డిజైన్లను లబ్ధిదారులకే వదిలేసింది. ఇకపై ఎవరి ఇష్టప్రకారం వారే ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాల అంశంలో లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఐతే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చే ఆఫ్షన్ కే ఎక్కువమంది మొగ్గు చూపడంతో ఆర్ధికంగా భారాన్ని తగ్గించుకునేందుకు ఈ సడలింపు ఇచ్చింది. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లకు మాత్రం ఎంపిక చేసిన డిజైన్లోనే ఇళ్లు నిర్మిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు నిబంధనల్లో మార్పులు తీసుకురావడం వెనుక బలమైన కారణాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే లబ్ధిదారులు ఆప్షన్ మార్చుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    బహిరంగ మార్కెట్లో నిర్మాణ సామగ్రి, కూలీ ఖర్చులు పెరగడంతో పేదలు మొదట్లో మూడో ఆప్షన్‌కే ఎక్కువగా మొగ్గు చూపారు. మొదటి 5 లక్షల మందిలో 60% మంది మూడో ఆప్షన్‌ ఎంచుకున్నారు. అదే సమయంలో పలు జిల్లాల్లో ఇళ్ల డిజైన్లపై పెద్ద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆకృతి మార్పునకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ ఇష్ట ప్రకారం కట్టుకోవాలని ఆప్షన్లు మార్చుకున్నారు.

    ఇది చదవండి: గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు... కల నెరవేర్చిన పోలీసులు



    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రస్తుతం లబ్ధిదారులు నివశిస్తున్న ప్రాంతాలకు చాలా దారుంలో ఉండటంతో ప్రతి రోజూ అక్కడికి వెళ్లి ఇంటి నిర్మాణ పనులు చూసుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారింది. దీంతో ఎక్కువ మంది ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సొంత స్థలం ఉండి ప్రభుత్వ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ప్రభుత్వం కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే కల్పించింది. ఈ తరహా దరఖాస్తు దారులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్ తొలగించారు. మొదట్లో వీరికి మూడు ఆప్షన్లూ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రెండు ఆప్షన్లు మాత్రమే ఇస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. అందులో మొదటిది ఇంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సమకూరిస్తే లబ్ధిదారులే ఇల్లు కట్టుకోవడం. రెండోది ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం. మూడోది ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

    మొదట్లో ఇచ్చిన ఆప్షన్లలో ఇప్పుడు మార్పులు చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా చూడటమేనని తెలుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే పథకంలో నిర్ణయించిన ధరలపై కాంట్రాక్టర్లు ఆసక్తిచూపకపోవడం, నిధుల లభ్యత ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published: