ANDHRA PRADESH GOVERNMENT ISSUED GO GRANTING PERMISSION FOR FILM SHOOTS AND TELEVISION SHOOTS BS
టాలీవుడ్‌కు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ప్రేక్షకుల ముందుకు రానున్న జబర్దస్త్, కార్తీక దీపం..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన చిత్ర పరిశ్రమకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది.
కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన చిత్ర పరిశ్రమకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయించిన సర్కారు.. సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది. కరోనా దెబ్బకు ఆగిన షూటింగ్‌లకు అనుమతి దక్కడంతో జబర్దస్త్, కార్తీక దీపం లాంటి షోలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతేకాదు.. రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్‌కి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మూడు కేటగిరీలను విభజించింది.
కేటగిరి 1 (రోజుకు కాషన్ డిపాజిట్ రూ.15 వేలు):
రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో, పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్‌కు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ మ్యూజియం, బిల్డింగ్లు, పాఠశాలలు మరియు కాలేజీలలోనూ షూటింగ్ చేసుకోవచ్చు.
కేటగిరి 2 (రోజుకు కాషన్ డిపాజిట్ రూ.10 వేలు):
రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్‌లకు అనుమతి.
కేటగిరి 3 (రోజుకు కాషన్ డిపాజిట్ రూ.5 వేలు):
మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్‌తో సహా, అన్ని పార్కుల్లో షూటింగ్ అనుమతి ఇచ్చింది. ఏపీటిడిసి,ఆర్&బీ, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్‌లో షూటింగ్‌కి అనుమతి ఇస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఏపీ సర్కారు ఇచ్చిన జీవో
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.