ANDHRA PRADESH GOVERNMENT IS THINKING TO CONDUCT FULL DAY CLASSES FOR 9TH AND 10TH STUDENTS FROM JANUARY 18TH HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: స్టూడెంట్స్ కు 100 రోజుల ఛాలెంజ్..! స్కూళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) కరోనా (Corona) కారణం కారణంగా పాఠశాలలను పరిమితంగానే నిర్వహిస్తోంది. త్వరలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccine) ప్రారంభం కాబోతుండటంతో స్కూళ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కారణం కారణంగా పాఠశాలలను పరిమితంగానే నిర్వహిస్తోంది. త్వరలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుండటంతో స్కూళ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఈనెల 18 నుంచి రెండు పూటలా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 వరకే నిర్వహిస్తోంది. ఇదే సమయంలో మధ్యాహ్న భోజనాన్ని తరగతుల వారీగా విడివిడిగా అందిస్తోంది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత రెండు పూటల క్లాసులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా 9, 10 తరగతులపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మౌకిక ఆదేశాలు అందినట్లు సమాచారం. మరో మూడు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
100రోజుల ఛాలెంజ్
రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 2 నుంచి 9, 10 తరగతులకు క్లాసులు ప్రారంభించారు. అలాగే గత నెల 14 నుంచి 7,8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత ఈనెల 18 నుంచి 6వ తరగతికి క్లాసులు నిర్వహిస్తున్నారు. రెండు పూటల క్లాసులు నిర్వహించడం వెనుక ప్రధాన కారణం టెన్త్ పరీక్షలే కారణంగా తెలుస్తోంది. పదో తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసేందుకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారంలో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో 100 రోజుల కార్యాచరణను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం 1-5 తరగతుల విద్యార్థులకు క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 5 నుంచి 10ఏళ్ల మధ్య వసున్న పిల్లలకు కరోనా మార్గదర్శకాలపై అవగాహన లేకపోవడంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువగా ఉండే అవకాశముండటంతో ఆయా తరగతులకు క్లాసులు నిర్వహించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు ఈనెల 18 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. అడ్మిషన్లు ప్రారంభించిన నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజుల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. కొవిడ్ నేపథ్యంలో ప్రజలపై భారం వేయొద్దని సూచించింది. ఐతే దీనిని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. మరో వారం రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు మొదలవుతున్నందున కాలేజీల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.