హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం... ఇకపై వాళ్లు హ్యాపీ...

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం... ఇకపై వాళ్లు హ్యాపీ...

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

Andhra pradesh : ఈ రోజు మనం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. వాటిలో ఒకటి ఏపీ ప్రభుత్వానికి సంబంధించినది. అదేంటో తెలుసుకుందాం.

Andhra pradesh : ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న పథకాలు మరింత ఎక్కువ మందికి వర్తించేలా చేయబోతోంది. పథకాల్లో ఒకటైన పెన్షన్ల పథకాన్ని ఇవాళ్టి నుంచీ (ఆదివారం మార్చి 1 2020) కొత్తగా మరో ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతోంది. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 10 శాతం డబ్బును ఈ పెన్షన్ల కోసమే ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇక ఈ పెన్షన్లను గ్రామ, వార్డు వాలంటీర్లు స్వయంగా ఇళ్లకే తెచ్చి ఇస్తారని మనకు తెలుసు. ఐతే... కొంత మంది గత నెలలో (జనవరిలో) తమకు పింఛను రాలేదని కంప్లైంట్లు చేశారు. అవి రీ వెరిఫికేషన్ చేసి... ఈ నెలలో గత నెల పెన్షన్ కూడా కలిపి (జనవరి, ఫిబ్రవరి) ఇవ్వబోతున్నారు. మీకు తెలుసా... ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దాదాపు 15 రకాల పెన్షన్లు ఇస్తోంది. వాటిలో ముసలివాళ్లు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా రకరకాలు. వీళ్లందరికీ నెలకు రూ.2250 ఇస్తున్నారు. అలాగే... చర్మకారులు, డబ్బు కళాకారులు, దివ్యాంగులు, హిజ్రాలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి నెలకు రూ.3000 ఇస్తున్నారు. అంతేనా... తలసేమియా వ్యాధిగ్రస్తులు, బోధకాలుతో బాధపడుతున్నారు, డయాలసిస్ చేయించుకునేవారికి రూ.5000 చొప్పున ఇస్తున్నారు. ఇక పక్షవాతం, సికిల్ సెల్ (రక్తహీనత)తో బాధపడేవారికి నెలకు రూ.10000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇలా నెలకు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండటం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.1320.76 కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ పెన్షన్లు... లబ్దిదారుల జీవితాల్ని అద్భుతంగా మార్చేయకపోవచ్చు... కానీ... వాళ్లకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది. నెల నెలా ప్రభుత్వం నుంచీ డబ్బు వస్తుందనే ఆలోచనతో వాళ్లు కాస్త ధైర్యంగా బతకగలరు.

మీకు తెలిసే ఉంటుంది. జనవరిలో 54,68,322 మంది ఏపీ ప్రభుత్వం నుంచీ పెన్షన్లు పొందారు. ఫిబ్రవరిలో పెన్షన్ పొందేవారి సంఖ్యను పెంచి... మొత్తం 60 లక్షల మందికి ఇవ్వబోతున్నారు. మరి ఈ లబ్దిదారుల్లో ఏ జిల్లా ప్రజలు ఎక్కువగా ఉన్నారో తెలుసా... తూర్పుగోదావరి జిల్లా. ఈ ఒక్క జిల్లాలోనే మొత్తం 6,23,093 మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇక విజయనగరం జిల్లాలో పెన్షన్ పొందుతున్నవారు చాలా తక్కువగా అంటే 3,02,734 మందే ఉన్నారు. ఇలా 13 జిల్లాలూ కలిపి 60 లక్షలు దాటేశారు. కొత్తగా 5 లక్షల మంది లబ్దిదారులుగా మారారు కాబట్టి... వారి కోసం ప్రభుత్వం అదనంగా రూ.200 కోట్లు రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఖజానాలో ప్రస్తుతం పెద్దగా డబ్బు లేదు. ఉన్న కొద్దిపాటి డబ్బునూ... ఇలా పథకాల కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. ఆ విషయంలో రాజీపడకుండా మాట తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

First published:

Tags: AP News, Cm jagan, Pension Scheme, Ys jagan

ఉత్తమ కథలు