HOME »NEWS »ANDHRA PRADESH »andhra pradesh government identify and list 86 danger zone companies to ensure safety measures nk

ఏపీలో 86 ప్రమాదకర పరిశ్రమలు... ప్రభుత్వం సంచలన నిర్ణయం...

ఏపీలో 86 ప్రమాదకర పరిశ్రమలు... ప్రభుత్వం సంచలన నిర్ణయం...
గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్ (File)

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు వెలువడిన ఘటన తర్వాత... ప్రభుత్వం పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.

  • Share this:
    భోపాల్ గ్యాస్ ప్రమాదాన్ని తలపించిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదం... ఏపీలో భద్రతా ప్రమాణాలు లేని ప్రమాదకర పరిశ్రమలు ఎన్ని ఉన్నాయనే అంశంపై చర్చకు తెరతీసింది. ఫాక్ట్ ఫైండింగ్ చెయ్యగా... చెరువులో చేపల్లా... మొత్తం 86 పరిశ్రమలు ఉన్నట్లు తేలింది. అంటే... వీటిలో ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ 86 పరిశ్రమలకు ప్రభుత్వ అధికారులు వెళ్తారు. భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. ఎలాంటి ప్రమాదమూ జరగదు అని ఫిక్స్ అయ్యాకే... తిరిగి తెరవడానికి అనుమతిస్తారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ ఉండదని ప్రభుత్వం తెలిపింది.

    విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో దుర్ఘటన తర్వాత ఈ జాబితా రూపొందింది. ప్రమాదం జరగటానికి ఛాన్స్ ఉన్న పరిశ్రమల జాబితాలో ఫార్మా, గ్యాస్‌, రసాయనాలు తయారు చేసే భారీ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఆ పరిశ్రమల్లో యంత్రాలు, బాయిలర్లు, రసాయనాలు నిల్వ చేసే ట్యాంకుల దగ్గర భద్రతా ప్రమాణాల్ని పరిశీలించి, రెండు రోజుల్లో నివేదిక పంపాలని పరిశ్రమల శాఖ... ఆయా జిల్లాల్లో అధికారుల్ని ఆదేశించింది.



    రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పోలీసుశాఖ తరపున సభ్యులు వెంటనే వెళ్లి... కంపెనీల భద్రతా విభాగం అధికారులను కలిసి తనిఖీలు మొదలుపెట్టారు. ఇక్కడ సమస్యేంటంటే... వీళ్లకు ఎక్కువ టైమ్ లేదు. రెండ్రోజుల్లో అంటే... అసలు ముందు ఆ కంపెనీ ఎలాంటిది, దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ప్రమాద తీవ్రత స్థాయి ఎంత దూరం ఉంటుంది, ప్రమాదం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలున్నాయి, ఒకవేళ జరిగితే త్వరగా ఆపేలా ఏయే ఛాన్సులున్నాయి ఇవన్నీ అధికారులకు ముందే అవగాహన ఉండాలి. ఇప్పటికిప్పుడు సడెన్‌గా వెళ్లి... అక్కడున్న పరికరాల్ని చూసి... ఓకే ఓకే అనుకుంటే కుదరదు. ఎందుకంటే... అధికారులు బానే ఉంది అనే రిపోర్ట్ ఇస్తే... ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. తీరా కంపెనీ తెరిచాక... అలా లేకపోతే, ప్రమాదమే.

    అధికారులు ప్రమాదకరంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాల నుంచి భద్రతా ప్రమాణాలు పాటించినట్లు కచ్చితమైన హామీ పత్రాన్ని తీసుకోవాలి. జనరల్‌గా ఏ కంపెనీలైనా తాము పర్‌ఫెక్ట్ అని చెప్పుకుంటాయే తప్ప... మా దగ్గర అంత భద్రత లేదు అని చెప్పవు. కాబట్టి... అలాంటి హామీ పత్రం ఇచ్చినా... నిజంగా అంత భద్రతా ప్రమాణాలు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చెయ్యాల్సిందే. బట్ అధికారుల దగ్గర టైమ్ లేదు. విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై సర్కార్ నియమించిన హైపవర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి నెల టైమ్ ఇచ్చిన ప్రభుత్వం... 86 కంపెనీలను చెక్ చెయ్యడానికి రెండ్రోజులే సమయం ఇవ్వడం విచారకరమే. కనీసం ఓ వారమైనా టైమ్ ఇస్తే.... అధికారులకు కంపెనీపై పూర్తి అవగాహన కలిగి... వాస్తవాల్ని పసిగట్టే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
    Published by:Krishna Kumar N
    First published:May 09, 2020, 10:48 IST