Belum Caves Festival: డిసెంబర్ 21, 22న బెలూం గుహల ఉత్సవాలు... వెళ్లండిలా

Belum Caves festival | బెలూమ్ కేవ్స్ భారతదేశంలోనే రెండో అతిపెద్ద గుహలు కావడం విశేషం. మేఘాలయలోని క్రెమి లియాత్ ప్రహ్ గుహల తర్వాత సహజసిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద గుహలివి.

news18-telugu
Updated: December 19, 2019, 1:36 PM IST
Belum Caves Festival: డిసెంబర్ 21, 22న బెలూం గుహల ఉత్సవాలు... వెళ్లండిలా
Belum Caves Festival: డిసెంబర్ 21, 22న బెలూం గుహల ఉత్సవాలు... వెళ్లండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కర్నూలు జిల్లాలోని బెలూమ్ గుహల్లో ఉత్సవాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ 21, 22 తేదీల్లో 'బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్' నిర్వహించనుంది. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహలకన్నా పొడవైనవి. బెలూం గుహల ప్రాముఖ్యతను చాటేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా అధికారులు రోడ్లు రిపేర్లు చేయించడంతో పాటు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధుడి విగ్రహం దగ్గర మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. బెలూం గుహల గురించి వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలన్న ఉద్దేశం ఈ ఉత్సవాల లక్ష్యం. బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్ కోసం చేసే ఏర్పాట్లు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండేటట్టు చూస్తున్నారు. అతిపెద్ద ఫుడ్ కోర్టుతో పాటు 10 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. జయింట్ వీల్స్, ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ కూడా పర్యాటకులను అలరించనున్నాయి. సుమారు రూ.50 లక్షల ఖర్చుతో 'బెలూమ్ కేవ్స్ ఫెస్టివల్' నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.





బెలూమ్ కేవ్స్ భారతదేశంలోనే రెండో అతిపెద్ద గుహలు కావడం విశేషం. మేఘాలయలోని క్రెమి లియాత్ ప్రహ్ గుహల తర్వాత సహజసిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద గుహలివి. 10 వేల అడుగులకు పైగా పొడవు ఉంటుంది. ఆసియాలోనే అతిపొడవైన గుహల్లో ఒకటిగా పేరుంది. హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదట కర్నూలుకు చేరుకొని ఆ తర్వాత నంద్యాల వెళ్లాలి. అక్కడ్నుంచి బెలూం గుహలకు వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులు ఉంటాయి.అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి జనవరిలో గుడ్ న్యూస్

Indian Railways: యువతకు భారతీయ రైల్వే శుభవార్త... రైలు టికెట్లపై 50 శాతం తగ్గింపు

Amazon Fab Phones Fest: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్
First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు