Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT HIKES LAND MARKET VALUES IN NEW DISTRICTS HEAD QUARTERS FULL DETAILS HERE PRN

Land Rates in AP: ఏపీలో భారీగా పెరిగిన భూముల ధరలు.. విజయవాడలో గజం ఎంతంటే..!

ఏపీ కొత్త జిల్లా కేంద్రాల్లో పెరిగిన భూముల ధరలు

ఏపీ కొత్త జిల్లా కేంద్రాల్లో పెరిగిన భూముల ధరలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) ఏర్పడ్డాయి. కొత్తగా13 జిల్లాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఐతే జిల్లాల అవతరణ తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) ఏర్పడ్డాయి. కొత్తగా13 జిల్లాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఐతే జిల్లాల అవతరణ తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లాల ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) పెరిగే అవకాశముండటంతో జిల్లా కేంద్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెరిగాయి. ఏరియాను బట్టి 13శాతం నుంచి 75శాతం వరకు ధరలు పెంచారు. ఈ పెంపును స్పెషల్ రివిజన్ అని అధికారులు పేర్కొన్నారు. ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు (Land Registration) కూడా పెరిగాయి. భూముల మార్కెట్ విలువలపై కొంతకాలంగా చర్చ జరుగుతుండగా.. జిల్లాల ఏర్పాటు తర్వాత పెంపు ప్రక్రియను ప్రారంభించింది. కొత్తగా ఏర్పటిన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఫిబ్రవరి 1 నుంచే ధరలు పెరిగాయి.

  విజయవాడ (Vijayawada) లో బందర్ రోడ్డులో ప్రస్తుతం గజం 96,400 ఉండగా.. తాజాగా రూ.1.10 లక్షలకు పెరిగింది. విజయవాడ శివారులోని కానూరులో గజం రూ.13,500 ఉండగా.. అది రూ.17,000కు పెరిగింది. పెనమలూరు మండలం పెదపులిపాకలో 37.25శాతం పెరిగింది. రాజమహేంద్రవరం కోటగుమ్మ సెంటర్లో గజం రూ.76వేల నంచి రూ.86వేలకు పెరిగింది. దేవీచౌక్ లో గజం రూ.42వేల నుంచి రూ.48వేలకు పెరిగింది.

  ఇది చదవండి: పుష్ప నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఏపీలో బెస్ట్ షూటింగ్ స్పాట్ ఇదే..


  అలాగే కోనసీమ జిల్లాలో ధరలు భారీగా పెరిగాయి. అమలాపురంలో రూ.18వేలుగా ఉన్న గజం స్థలం ఇప్పుడు రూ.22,500కు చేరింది. పేరూరులో రూ.8,500 నుంచి రూ.12,500కు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, గనుపూడి, వీరవాసరం, ఉండి ప్రాంతాల్లో 20శాతానికి పైగా ధరలు పెంచారు. కొవ్వూరులో ఏకరం భూమి రూ.35 లక్షల నుంచి రూ.42 లక్షలకు పెరిగింది.

  ఇది చదవండి: ఆ పథకాలతో మొదటికే మోసం.. రాష్ట్రాల్లో సంక్షోభం తప్పదు.. కేంద్రం వార్నింగ్..?


  అనకాపల్లి జిల్లాలో 16 నుంచి 30శాతం వరకు పెంచారు. ఐతే ఆయా ప్రాంతాల్లో 50 శాతం వరకు పెంచారన్న ప్రచారం జరుగుతోంది. తాళ్లపాలెంలో ఎకరం రూ.26 లక్షల నుంచి రూ.33 లక్షలకు పెంచారు. ఏజెన్సీ జిల్లాలను చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ధరలు పెరిగాయి. ఆయా గ్రామాల్లో దాదాపు 30శాతం వరకు పెరిగాయి. పట్టణంలోని మెయిన్ రోడ్డులో గజం రూ.18వేల నుంచి రూ.26వేలకు పెరిగాయి.

  ఇది చదవండి: మంత్రులకు లాస్ట్ వర్కింగ్ డే.. సీఎం జగన్ నిర్ణయంపై సస్పెన్స్..


  కొన్ని జిల్లాల్లో మార్కెట్ విలువలు అసాధారణంగా పెంచే ప్రతిపాదనలు కూడా రాగా ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి సవరించి పంపాలని సూచించింది. కొన్నిచోట్ల విలువల పెంపు ఇంకా గందరగోళంగానే ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ పెంపు కొత్త జిల్లా కేంద్రాల వరకే పరిమితమవుతుందా లేక రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP new districts, Lands

  తదుపరి వార్తలు