Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT HIKE MARKET VALUES OF BUILDINGS AND OTHER HOUSES IN THE STATE FULL DETAILS HERE PRN GNT

Flats Rates in AP: ఏపీలో పెరిగిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత పెరిగాయో తెలుసా..?

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే భారీగా భూముల ధరలు పెంచింది. తాజాగా భవనాలు, ఇతర నిర్మాణాల మార్కెట్ విలువలు కూడా పెంచింది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే భారీగా భూముల ధరలు పెంచింది. తాజాగా భవనాలు, ఇతర నిర్మాణాల మార్కెట్ విలువలు కూడా పెంచింది. భవనాలు మాత్రమే కాదు.. రేకుల షెడ్లు, పూరిళ్ల ధరలు కూడా పెంచింది. చిన్న భవనం నుంచి అపార్ట్ మెంట్లు, మల్టీప్లెక్సుల వరకు నిర్మాణాలపై విలువ పెంచింది. అలాగే మట్టి గోడల ఇళ్లకు, తాటాకుల గుడిసెలకు ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.10 నుంచి రూ.60 వరకు విలువను పెంచింది. పెంచిన విలువలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. తాజా నిర్ణయంతో ఇల్లు కొనాలన్నా సాధ్యమయ్యే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

    పెరిగిన విలువల ప్రకారం 1500 చదరపు ప్లాట్ కొనుగోలు చేయాలంటే గరిష్టంగా లక్ష వరకు అదనంగా చెల్లించాల్సిందే. గజాల అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం మార్కెట్ విలువ సుమారు చదరపు గజానికి రూ.1100 ఉండగా జూన్ నుండి సుమారు రూ.1200 వరకు పెరుగుతుంది. అంటే ఒక అపార్ట్మెంట్ కొనటానికి సుమారు ఏడువేల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ రుసుము పెరిగే అవకాశముంది. ఈలెక్కన ప్రజలపై ఏడాదికి రూ.125 కోట్ల మేర భారం పడనుంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారీటల పరిధిలో చదరపు అడుగుకు రూ.60 చొప్పున ధరలు పెరిగే అవకాశముంది.

    ఇది చదవండి: ఆ మూడు పార్టీలు బీజేపీ నీడలోనే.. ప్రశ్నించేవారినే నమ్మాలి.. నేరస్తులను కాదు.. ఉండవల్లి హాట్ కామెంట్స్..


    పెరిగిన విలువలను పరిశీలిస్తే.. నగరాలు పట్టణాల్లో చదరపు అడుగుకు ప్రస్తుతమున్న విలువపై రూ.60 వరకు పెరగనుంది. మేజర్ పంచాయతీల్లోనూ ఇది రూ.60గానే ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణాలు అవి ఎలాంటివైనా సరే చదరపు అడుగుకు రూ.30 చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఉమ్మడి గోడలు లేని అపార్ట్ మెంట్లకు చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.60 వరకు పెంచారు. ఇక రేకుల షెడ్లకు పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో రూ.30 చొప్పున, గ్రామాల్లో రూ.20 చొప్పున పెంచారు. ఇక మట్టిగోడల మిద్దెలకు పట్టమాల్లో రూ.20, మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో చదరపు అడుగుకు రూ.10 చొప్పున పెంచారు. వీటితో పాటు నిర్మాణంలో ఉన్నవాటిపైనా విలువ పెరగనుంది. పునాదిలో ఉంటే పెంచిన విలువలో 25శాతం, స్లాబ్ దశలో ఉంటే 65శాతం, పూర్తికావడానికి సిద్ధంగా ఉంటే 85శాతం పెంపు అమలవుతుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Lands

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు