హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Green Signal: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. క్యాన్ బీర్ కు అనుమతి

Green Signal: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. క్యాన్ బీర్ కు అనుమతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Good News to Drinkers: ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర సరిహద్దులో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. కానీ ఓ కండిషన్ పెట్టింది.

Green Signal to Can beer: మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh Government) గుడ్ న్యూస్ (good news) చెప్పింది. సీఎం గా జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టిన తరువాత తమకు ఇదే తీపి కబురు అంటున్నారు మందుబాబులు.. ఎందుకంటే.. సీఎం జగన్ అధికారం చేపట్టగానే మద్య నిషేధం చేస్తానని ప్రకటించారు. ఆ వెంటనే ఆ దిశగా కొన్ని అడుగులు వేశారు. దశల వారీగా పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ సర్కార్.. రాష్ట్రంలో అప్పటి వరకు 4380 వైన్స్ షాపు (Wine Shopలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని గతంలోనే 3500కు తగ్గించారు. అలాగే ధర పెరిగితే తాగే వారు తగ్గుతారని భావించి ధరలను కూడా పెంచారు. లిక్కర్ పై 2 రోజుల్లోనే 75శాతం ధరలను పెంచారు. అయినా కూడా మందు బాబులు వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేశారు. ఐతే మందు బాబులకు షాకిచ్చేలా ఏపీ సర్కార్ ఆ వెంటనే షాపుల సంఖ్యను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వస్తోంది. అంతేకాదు ప్రధాన బ్రాండ్లు ఏవీ ఏపీలో లేకుండా.. పేరు ఊరు లేని బ్రాండ్లను పరిచయం చేసింది. అయినా మందు బాబులు ప్రభుత్వానికి తిట్టుకున్నారు తప్ప.. తాగడం మానలేదు. ఓ వైపు వైన్ షాపులను తగ్గించడం, టైమింగ్స్ ను మార్చడం.. బ్రాండ్ లేని మద్యం బాటిళ్లు అమ్మడం ఇలా అన్నీ మందు బాబులకు వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటూ వచ్చింది. దీంతో ఏపీలో ఏ మందు బాబును కదిపినా ప్రభుత్వాన్ని తిట్టేవారే అధికంగా కనిపిస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం తాజాగా మందు బాబులకు ఊహించని గుడ్ న్యూస్ చెప్పింది.

మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో 90 ఎంఎల్ పరిమాణంలో మద్యం అమ్మకాలకు మాత్రమే ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్రమ రవాణా, నాటు సారా, గంజాయి వినియోగం తగ్గించేందుకు క్యాన్ బీర్ బాటిళ్లకు అనుమతించలేదని.. 90 ఎంఎల్ లిక్కర్‌కు అనుమతిచ్చామంటోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకుంది.. ఆధునీకరణ కోసం ఒక్కో కెమికల్ ల్యాబ్ కు 5 లక్షలు కేటాయించింది సర్కార్‌.. ప్రభుత్వ లిక్కర్ (Liquor)వాక్ ఇన్ స్టోర్స్‌లో మద్యం ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ.. మద్యం స్టాక్ ఆడిట్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ పార్టీ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలు నిర్వహించనుంది ఈ స్పెషల్ ఆడిట్ పార్టీ..

ఇదీ చదవండి: కరెంటే కాదు బిల్లు కూడా షాకిస్తోంది.. సాధారణ కూలీకి లక్షల్లో బిల్లు.. సిబ్బంది సమాధానం విని మైండ్ బ్లాంక్

మరోవైపు ఇటీవలే విశాఖపట్నం(Viskhapatnam) లో మందు బాబులకు ఎక్సైజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇనాళ్లూ మద్యం కావాలంటే క్యూలైన్లో నుంచోని నచ్చిన బ్రాండ్ దొరకుతుందో లేదో అని టెన్షన్‌తో మద్యం ప్రియులు ఉండేవారు. ఇప్పుడు అలాంటి టెన్షన్ లేకుండా ప్రీమియం వాక్ ఇన్ స్టోర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్. సీతమ్మదార పుడ్‌ఎక్స్ దగ్గర, అప్పూగర్ దగ్గర ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్‌లో ప్రయెగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా 11 స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, Drinkers, Liquor sales, Wine shops

ఉత్తమ కథలు