Power Cuts in AP: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యుత్ కోతలపైనే చర్చ జరుగుతోంది. దసరా తర్వాత భారీగా విద్యుత్ కోతలు (Power Cuts in AP) ఉండబోతున్నాయన్న ప్రచారానికి ప్రభుత్వం (AP Government) తెరదించింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యుత్ కోతపైనే (Power Cuts in AP) చర్చ జరుగుతోంది. బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం (Power Crisis) ఏర్పడుతోందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండబోతున్నయంటూ ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా ఏపీలో కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో (Social Media) విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత కరెంట్ కోతలు పెరబోతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాట్సాప్ (Whats App), ఫేస్ బుక్ (Facebook), టెలిగ్రామ్ (Telegram) వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. అందులో నిజం లేదని స్పష్టం చేసింది. దసరా పండుగ తర్వాత గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ ప్రకటించింది.

  ఇదీ ప్రచారం...
  “ శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయి. పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పవర్ కట్.. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్.. పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కరెంట్ కట్” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

  ఇది చదవండి: జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం.. కిడ్నాపర్లు వీళ్లే.. ఎలా దొరికారంటే..!


  ప్రభుత్వం ఏం చెప్పిందంటే..!
  దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌రిలీఫ్‌రరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందేని.., ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నాయని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించినట్లు తెలిపింది. ఏపీ జెన్ కోకు బొగ్గు కొనుగోలు కోసం రూ.250 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని.., అలాగే ఏపీకి అనదనం రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారన్నారు.

  ఇది చదవండి: 'తప్పుచేసిన వాడు జైలుకు పోతాడు..' ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన కామెంట్స్...  సింగరేణి నుంచి బొగ్గు...
  అలాగే తెలంగాణలో ఉన్న సింగరేణి నుంచి తగినంత బొగ్గు తెచ్చేలే ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వి.టి.పి.ఎస్‌, కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయించని విద్యుత్ వాటా నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ఏపీ కోసం దాదాపు 400 మెగావాట్ల విద్యుత్ కోసం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు ఇంధన శాఖ స్పష్టం చేసింది. బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడినట్లు పేర్కొంది.
  Published by:Purna Chandra
  First published: