• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT GIVES CLARITY ON NEWS SAND POLICY FULL DETAILS HERE PRN

AP New Sand Policy: ఇసుక పాలసీపై విమర్శలకు ప్రభుత్వం రియాక్షన్ ఇదే..

AP New Sand Policy: ఇసుక పాలసీపై  విమర్శలకు ప్రభుత్వం  రియాక్షన్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

AP Sand Policy: ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తాం మన్న ఆయన.. ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీపై వస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా ఇసుక సరఫరా టెండర్లు నిర్వహించినట్లు పంచాయతీ రాజ్ శాఖ, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తాం మన్న ఆయన.. ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు కావాలంటే సొంత వాహనంలో తీసుకెళ్లొచ్చున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరగాలన్న ఆయన.. నిర్ణీత రేటు కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే 14500 నెంబర్‍కు కాల్ చేసి ఫిర్యాదు చేయవడచ్చన్నారు.

    ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేసి తర్వాతే కొత్త విధానం రూపొందించామన్న ఆయన.. ఇకపై ఆన్‍లైన్ కాకుండా నేరుగా వెళ్లి ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఇసుక విధానంలో ప్రజలకు మెరుగైన లబ్ధి చేకూరుతుందన్నారు. ఇసుక తవ్వకం, నిల్వ, పంపిణీల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎం‍ఎస్‍టీసీకి బాధ్యతలకు అప్పగించామన్నారు. కాంట్రాక్టరు ఎంపిక కోసం అత్యంత పారదర్శక విధానాన్ని రూపొందించి ఇందులో భాగంగానే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. వేలంలో పాల్గొనేలా బిడ్ సెక్యూరిటీగా రూ.120 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంపెనీల సాంకేతిక సమర్థతలను పరిశీలించిన తర్వాత ఆర్థిక బిడ్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్... అదేంటంటే...!


     ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయానకి సంబంధించిన టెండర్లను జేపీ గ్రూపులో భాగమైన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం మూడు జోన్లుగా ఇసుక రీచ్ లను ప్రభుత్వం విభజించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు జోన్‌-1గా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు జోన్‌-2గా, నెల్లూరు, రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు కలిపి జోన్‌-3గా విభజించారు.



    మూడు జోన్లలోని 471 రీచ్‌లలో రెండు సంవత్సరాల పాటు ఇసుక తవ్వకాలు జరిపి, విక్రయాల కోసం టెండర్లు నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో 5 ప్రైవేటు సంస్థలు బిడ్లు జాఖలు చేశాయి. వీటిలో అత్యధికంగా ప్యాకేజీ-1లో రూ.477.5 కోట్లు, ప్యాకేజీ-2లో రూ.745.7 కోట్లు, ప్యాకేజీ-3లో 305.6 కోట్లు ఇలా మొత్తం రూ.1,528 కోట్లు చెల్లిస్తామంటూ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థ కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచింది. దీంతో ఈ సంస్థకు మూడు ప్యాకేజీలను ఖరారు చేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను జేపీ పవర్స్ సంస్థ చేపడుతుంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు