హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Power Issue: ఏపీలో విద్యుత్ సంక్షోభం రానుందా.. మళ్లీ కోతలు తప్పవా..? ప్రభుత్వం ముందస్తు చర్యలు ఇవే.!

AP Power Issue: ఏపీలో విద్యుత్ సంక్షోభం రానుందా.. మళ్లీ కోతలు తప్పవా..? ప్రభుత్వం ముందస్తు చర్యలు ఇవే.!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బొగ్గు కొరత కారణంగా దేశంలో విద్యుత్ సంక్షోభం (Power Crisis) తలెత్తిన సంగతి తెలిసందే. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ అదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు దేశంలో మరోసారి బొగ్గు సంక్షోం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బొగ్గు కొరత కారణంగా దేశంలో విద్యుత్ సంక్షోభం (Power Crisis) తలెత్తిన సంగతి తెలిసందే. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ అదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు దేశంలో మరోసారి బొగ్గు సంక్షోం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హెచ్చింరింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామల వల్ల గతేడాది తలెత్తిన బొగ్గు కొరత.. ఆ తర్వాత తగ్గింది. ఐతే మరోసారి అదేరకమైన పరిస్థితులు పునారవృతమయ్యే అవకాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో మార్చి నుంచి జూన్ వరకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో బొగ్గు వినియోగం కూడా అదేస్థాయిలో పెగిరి కొరత ఏర్పడింది.

  దేశంలో మొత్తం 180 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వాటిలో ఇప్పటికే 74 చోట్ల బొగ్గు కొరత ఏర్పడింది. సొంత గనులున్న విద్యుత్ కేంద్రాలు మాత్రమే 90శాతానికి పైగా నిల్వలు సమకూర్చుకున్నాయి. దిగుమతిపై ఆదారపడే కేంద్రాల్లోమాత్రం బొగ్గు నిల్వలు 50శాతం కూడా లేవు. అదీగాక వర్షాల కారణంగా బొగ్గు వెలికీతకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో ఆగస్టులో బొగ్గు సరఫరా తగ్గి నిల్వలు పడిపోయే అవకాశముంది.

  ఇది చదవండి: చరిత్రలో ఇదే మొదటిసారి.. రికార్డ్ బ్రేక్ చేసిన అఖండ గోదావరి


  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం రోజుకు 190 యూనిట్ల డిమాండ్ ఉంది. ఐతే గత జూలై నెలలో 140 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలోని జెన్ కో కేంద్రాలు 50 మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో బగిరంగ మార్కెట్లో 21.81 మిలియన్ యూనిట్లను ప్రభుత్వం రూ.6.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఏపీలోని జెన్ కో కేంద్రాల్లో బొగ్గు నిల్వల విషయానికి వస్తే.. విజయవాడలోని వీటీపీఎస్ లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ప్రస్తుతం మూడు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడ 68 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. ఇక కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నుల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 3 లక్షల 25వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు.. ఫ్రీ ట్రైనింగ్.. అర్హతలివే..!


  ఇదిలా ఉంటే ఆగస్టులో బొగ్గు సంక్షోభం తలెత్తే అవకాశముందన్న కేంద్రం హెచ్చరిలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఏపీ జెన్ కో, ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలు 31 లక్షల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి. దీని వల్ల విద్యుత్ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకునే అవకాశముంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Coal, Power cuts

  ఉత్తమ కథలు