హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government: యువతకు నైపుణ్యం.. పేదలకు ఇళ్లు.. సుపరిపాలన.. అభివృద్ధి ఫార్ములా.. నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పబోయేది ఇదే..

AP Government: యువతకు నైపుణ్యం.. పేదలకు ఇళ్లు.. సుపరిపాలన.. అభివృద్ధి ఫార్ములా.. నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పబోయేది ఇదే..

నీతి ఆయోగ్ లో చెప్పబోయేది ఇదే

నీతి ఆయోగ్ లో చెప్పబోయేది ఇదే

AP Government: యువతకు ఉద్యోగవకాశాలు.. పేదలకు ఇళ్లు.. సుపరిపాలన.. సమగ్రాభి వృద్ధి తమ ప్రభుత్వం అజెండా అంటోంది జగన్ సర్కార్.. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రంజేంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధమైంది..?

ఇంకా చదవండి ...

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP Government: భారత దేశం మొత్తం ఫోకస్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై పడేలా చేసేందుకు సిద్ధమైంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Mohan ReddyGovernment ).. కేవలం సంక్షేమం (Welfare Schemes) మాత్రమే తమ లక్ష్యం కాదని..  యువతకు నైపుణ్యం.. పేదలకు ఇళ్లు.. సుపరిపాలన.. సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా తమన  పాలన కొనసాగుతోందని వివరించేందుకు సిద్ధమైంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శం గా ఏపీ ప్రభుత్వ సుపరిపాలనను అందిస్తున్నది అన్నది చెప్పాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ (Niti Ayog) కౌన్సిల్ సమావేశం వేదికగా దీనిపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇస్తామంటుని న్యూస్ 18కి వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh). నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రల  సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఏపీ సక్సెస్ స్టోరీని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వేదికపై ప్రదర్శించనుంది.

రాష్ర్టాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం ఆవశ్యకతను తెలపడంతో పాటు దేశానికే తలమానికంగా నిలిచే రాష్ట్రంలోని సుపరిపాలన.. అభివృద్ధి వికేంద్రీకరణ పాలసీ కింద సచివాలయ వ్యవస్థ కింద ప్రభుత్వ పాలనలను ప్రజల గడప వద్దకు చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా సక్సెస్ అయ్యిందో వివరించనుంది.

రేపు ఢిల్లీ వేదికగా జరిగే నీతి ఆయోగ్ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశంలో కీలకంగా వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంశాలపై నీతి ఆయోగ్‌ పాలక మండలి ఈ సమాశంలో రాష్ర్టాలతో చర్చించనుంది.

ఇదీ చదవండి : సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్.. ఇప్పటి వరకు ఎంత నగదు విడుదల చేశారంటే?

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలపై మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పిన అంశాలు ఏంటంటే..?  ప్రతి గ్రామంలో పసిపిల్లల నుంచి పండు ముసలి వరకూ పోషకాహారం నుంచి వృద్ధాప్య పెన్షన్ నుంచి స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తున్నామన్నారు. మహిళలు మొదలు రైతుల వరకు ఆరోగ్య, వ్యవసాయ సేవల వరకు అన్నింటినీ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నీతి ఆయోగ్ వేదికగా ప్రకటిస్తామన్నారు.

ఇదీ చదవండి: ఏపీ తరువాత సీఎం ఆయనే.. చిలక చెప్పిన జోస్యం ఇదే..

దీంతో పాటు  మహిళా సాధికారిత దిశలో చేయతతోపాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను, బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని రాష్ట్రం వివరించనుంది. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏరకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు అందించిందో నీతిఆయోగ్ వేదికపై రాష్ట్రం వివరించనుంది.

నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ప్రజారోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను రాష్ట్రం వివరించనుంది.

ఇదీ చదవండి : అధికార పార్టీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. గ్రామం మొత్తం ఖాళీ..? ఎందుకంటే?

ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు,  తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకంపై ఏపీలో తక్కువ సమయంలో జరిగిన మార్పులను, 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ల్‌ మధ్య అనుసంధానం ద్వారా రాష్ట్రంలో వైద్య రంగం, ప్రజారోగ్యం ఏ విధంగా మెరుగుపడిందనే అంశాలను ఇతర రాష్ర్టాలు అనుసరించే ఉత్తమ పద్దతులను రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో విజయం మాదే..? పొత్తులపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై ప్రత్యేకంగా నివేదిక..

ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో కీలకంగా చర్చించి ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడుల ఎంవోయూలను ఆన్ గ్రౌండ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింగిల్ విండో సిస్టంను రాష్ట్రం వివరించనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్‌ రంగంలో సాధించిన ప్రగతి, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను ప్రత్యేకంగా వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేశాము. రాష్ట్రం లో  10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లతో రాష్ట్రతీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలపై రాష్ట్రం వివరించనుంది.  వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అంశాల్లో కేంద్రం నుంచి అందాల్సిన సహాయం ఆవశ్యకతను రాష్ట్రం నీతి ఆయోగ్ పాలక మండలి వేదికపై ఉంచనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ న్యూస్ 18 కి  తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap minister suresh, AP News, Local News

ఉత్తమ కథలు