AP New Distircts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషఐన్ విడుదల చేయనున్నట్టు సమాచారం.. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు అంతా పూర్తైందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి నోటీఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇవాళ ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలకు.. కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) జిల్లాల పునర్విభజనపై పూర్తి నివేదికలు తెప్పించుకున్న తరువతే.. ప్రక్రియ ప్రారంభమైనట్టు సమాచారం. ఇటీవల వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే కొత్త జిల్లాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో ఈ దిశగా ప్రయత్నాలు సాగించింది అధికార పార్టీ.. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో దీనికి ఆమోద ముద్ర వేయించుకున్నారని.. కేంద్రం ఒకే చెప్పడంతో ప్రక్రియ ప్రారంభించారని సమాచారం. అయితే గతంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ రావడం, జనగణన పూర్తయ్యేవరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక హద్దులను మార్చడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ కార్యాలయం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో జిల్లాల పునర్విభజనకు అప్పుడు బ్రేక్ లు వేశారు. ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉండడంతో నోటిఫికేషన్ సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించాలనేది ప్రభుత్వం ఆలోచన. అలాగే స్థానిక వైసీపీ నేతల అభిప్రాయాలు.. అధికారుల నుంచి నివేదికలు అన్నింటినీ లెక్కలు వేసుకుని.. ఫైనల్ గా 26 జిల్లాలు ఉండేలా కసరత్తు చేసినట్టు సమాచారం. గతంలో సీఎం జగన్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలు కూడా నిర్వహించాయి. వాటి నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : బుద్ధా వెంకన్న అరెస్ట్.. మంత్రి నాని, డీజీపీపై వ్యాఖ్యలతో కేసు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న దూరం, ఇతర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన చూస్తే 25 జిల్లాలు కానుడగా.. అయితే అరకు పార్లమెట్ సెగ్మెంట్ విస్తీర్ణంలో పెద్దది కావడంతో దీనిని రెండు జిల్లాలుగా విభజించి.. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP new districts, AP News