మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకానికి మళ్లీ దరఖాస్తులు..

చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన మహిళలందరూ అప్లై చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: July 18, 2020, 10:59 AM IST
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకానికి మళ్లీ దరఖాస్తులు..
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 28తో గడువు సైతం ముగిసింది. అయితే గతంలో ప్రభుత్వ పింఛన్ అందుకుంటున్న మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. దీంతో చాలామంది మహిళలు వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోలేదు. కానీ ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. దీంతో చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన మహిళలందరూ అప్లై చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఐదు రోజులు గడువు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అర్హత ఉండి ఇప్పటివరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వితంతువులు, ఒంటరిమహిళలు, చేనేతకార్మికులు,దివ్యాంగులు, గీత, మత్స్యకార మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఇదిలావుంటే.. వైఎస్సార్ చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 18, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading