ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES TAKE DECISION ON STRIKE THEY READY TO STRIKE FROM FEBRUARY 7TH NGS
AP Employees Strike: ఫిబ్రవరి 7 నుంచి సమ్మె.. ఉద్యమ కార్యచరణ ఇదే..
సమ్మెకు సై అన్న ఉద్యోగ సంఘాలు
AP Employees Strike: ఏపీలో మరో భారీ సమ్మె సైరన్ మోగింది.. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగానలు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. సమ్మెకు సంబంధించిన నోటీసులను సోమవారం సీఎస్ కు ఇవ్వనున్నారు. సుదీర్ఘ కార్యచరణ ప్రకటించారు ఉద్యోగులు..
AP Employees Strike: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సమ్మె సైరన్ మోగింది.. ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు (Employees Union) నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma)ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నాయి. అలాగే సమ్మెతో పాటు.. అప్పటి వరకు ఎలాంటి కార్యచరణతో ముందుకెళ్లాలి అన్నదానిపైనా ఉద్యోగ సంఘాలు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. నిత్యం ఏదో ఒక రూపంలో తమన నిరసన తెలియచేయనున్నాయి ఉద్యోగ సంఘాలు.. అలాగే ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పిలుపు ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఏపీ ప్రభుత్వం (AP Government) కొత్తగా ఇచ్చిన జీవోలను వెనక్కు తీసుకునేంత వరకు తాము వెనుక అడుగు వేయమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.. సీఎస్ కు నోటీసులు ఇవ్వడంతో పాటు.. తమకు పాత జీతాలే ఇవ్వాలని కోరానున్నారు..
ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ఇదే.. ఈ నెల 23న అన్ని జిల్లాల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫిరెన్స్ లు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 25 తేదీన అన్ని జిల్లాల్లో అన్ని రకాల ఉద్యోగులు కలిపి భారీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. 27వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు.. రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి మూడవ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నారు.. అలాగే ఐదవ తేదీని అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు అంతా సహాయ నిరాకరణ చేపట్టనున్నారు.. అప్పటికే ప్రభుత్వం జీవో విషయంలో వెనక్కు తగ్గకపోతే.. ఏడో తేదీ నుంచి సమ్మెకు సిద్ధం కానున్నారు. దీనిపై ఇవాళ సీఎస్ సమీర్ శర్మను కలిసి.. సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే కొత్త పీఆర్సీ ప్రకారం కాకుండా కొత్త జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు.
మరోవైపు ఉద్యోగులను బుజ్జగించేందుకు వేసిన ప్రత్యేక కమిటీపైనా ఉద్యోగ సంఘాలు స్పందించాయి. అయితే ఆ సంప్రదింపుల కమిటీ ఏ ఉద్దేశ్యంతో వేసిందో తమకు తెలీదు అన్నారు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్. సహజంగా పీఆర్సీ ప్రకటనకు ముందు మంత్రుల కమిటీ వేస్తారు. కానీ ఈ ప్రభుత్వానిదంతా రివర్స్ వ్యవహారంగా ఉంది అని ఎద్దేవా చేశారు. పీఆర్సీని ప్రకటించి మంత్రుల కమిటీని వేశారు.. కానీ, మంత్రుల కమిటీ వేయడం ద్వారా ప్రభుత్వం మెత్తబడినట్టుగా మేం భావించలేమన్నారు. గతంలోనూ ఇదే విధంగా మెత్తబడినట్టు కన్పించి.. పీఆర్సీ జీవోలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, సచివాయంలో జరిపే సమావేశంలో ప్రభుత్వం వేసిన కమిటీ మీద కూడా చర్చిస్తామని తెలిపారు బండి శ్రీనివాస్.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.