ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES READY TO FIGHT AGAINST LATEST PRC AND DA GOS NGS
PRC Fight: ఏపీలో మళ్లీ పీఆర్సీపై రచ్చ.. సమ్మెకు సై అంటున్నఉద్యోగ సంఘాలు
ap employees protest
PRC Fight: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పీఆర్సీ రగడ మొదలైంది.. తాజగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మీ పీఆర్సీ మాకొద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిరసనలకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు.. ఇక సమ్మకు కూడా సై అంటున్నాయి..
PRC Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ (PRC) వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మొన్నీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో నేరుగా చర్చల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు.. సీఎం ఇచ్చిన హామీలపై ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ఎదుటే ఆయన ఫిట్ మెంట్ ను ప్రకటించారు.. ఆయన చెప్పిన ఇతర హామీలపై నమ్మకతో ఉద్యోగ సంఘాలు ఆ పీర్సీకి ఒప్పకున్నాయి.. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలతో పీర్సీసీ వివాదం మళ్లీ రచ్చ రచ్చ అవుతోంది. ఏపీ ప్రభుత్వం (AP Government) ప్రకటించిన పీఆర్సీ మాకొద్దు అని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయతీలను కూడా రద్దు చేయడం దారుణమని మండిపడుతున్నారు. తాజా జీవోలను చూస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చీకటి రోజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఒకమాట చెప్పి.. ఇప్పుడు మరో జీవో ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇక నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు అంతా నల్లబాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని నిర్ణయించారు. అలాగే అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు మత పోరాటం కొనసాగుతుంది అన్నారు.
పీఆర్సీపై ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేసిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీఆర్సీ ప్రకటిస్తే జీతాలు పెరగాలని.. ఇప్పుడు పీఆర్సీతో జీతాలు పెరగకపోగా.. ఇంకా తగ్గుతుండడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉద్యమించనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతుయి అన్నారు. కలిసి వచ్చిన అన్ని సంఘాలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటామని ఏపీ ఉద్యోగ, అమరావతి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. గత 10 పీఆర్సీల్లో లేని సంప్రదాయాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులకు తీవ్ర నష్టం కలుగుతోంది అంటున్నారు.
పీఆర్సీ పేరుతో ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మండిపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పీఆర్సీపై జీవోలను ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుతో ప్రతి ఉద్యోగికీ నష్టం తప్పడం లేదన్నారు. పదేళ్లకు పీఆర్సీ అంటే ఒప్పుకునేది లేదని.. ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రకటించాల్సిందే అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
హెచ్‌ఆర్‌ఏ రేట్లను తగ్గించడం వల్ల ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారని తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి పీఆర్సీపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను దగ్ధం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపు ఇచ్చాయి. తాజాగా ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.