ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే తేదీల్లో సెలవులు ప్రకటించింది. తొలిదశ జరిగే ఫిబ్రవరి 9, రెండో దశ పోలింగ్ తేదీ అయిన ఫిబ్రవరి 11న, మూడో దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి 13, చివరి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి 21వ తేదీ నాడు సెలవులు ప్రకటించింది.
ఈ తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలింగ్ తేదీ పోలింగ్ తేదీ నుంచి 44 గంటలు ముందుగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపునకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు సన్నద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఎలక్షన్ ఎజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాలపై దృష్టి పెట్టినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడ జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ, లోక్ సభకు పోటీ లేకుండా చేయగలమా..? అసెంబ్లీకి పోటీ కావాలి. లోక్ సభకు పోటీ కావాలి.. పంచాయతీలకు పోటీ అవసరం లేదంటే ఎలా నమ్ముతాం..? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరిగిననట్లు పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తే సరికాదని.., కగ్రీవాల కోసం మీటింగులు పెట్టి ప్రకటనలు చేసే వారిని ఇంట్లో కూర్చోబెడతామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap government, Ap local body elections, AP Schools, Gram Panchayat Elections, Telugu news