Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT CLARITY ON POWER CHARGES HIKE THESE ARE THE REASONS NGS

Current Charges Hike: ప్రజల కోరిక మేరకు విద్యుత్ చార్జీలు పెంపు.. ప్రభుత్వం వివరణపై ఆగ్రహ జ్వాలలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Current Charges Hike: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఇదేం బాదుడు అంటూ సమాన్యులు గగ్గోలు పెడుతున్నాయి. మరీ ఇంత దారుణమా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం.. ప్రజల కోరిక మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచామంటూ వివరణ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

ఇంకా చదవండి ...
    Current Charges Hike: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరెంటు మంటలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి.  విద్యుత్ ఛార్జీల పెంపు (AP Electricity Charges) పై సామాన్యులు, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు అమ్మో ఈ బాదుడు ఏంటి అని భయపడుతున్నారు. ఇక  ప్రతిపక్షాలు అయితే ఆందోళన బాట పడుతున్నాయి.  అయితే అంతేకాదు ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy)  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు.  ఇప్పుడు సీఎం జగన్ ఆధ్వర్యంలో భారీగా చార్జీల మోత మోగింది. అది కూడా మద్యతరగతిపై భారీగా భారం పడేలా కొత్త టారిఫ్ రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరలు చూస్తుంటే.. స్విచ్ ముట్టకుండానే విద్యుత్ షాక్ కొట్టేలా తయారైంది పరిస్థితి.   ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకున్న నిర్ణయం పై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమ్శలు ఎదురవుతున్నాయి.

    ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వ వివరణ మాత్రం వేరేలా ఉంది. ప్రజల కోరిన విధంగానే.. స్వల్పంగా విద్యుత్ చార్జీలను పెంచడం జరిగిందని ఎనర్జీ సెక్రటరీ శ్రీధర్ వెల్లడిస్తున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీల విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ వినియోగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏపీ విద్యుత్ వాడకం చాలా అధికమౌతోందని, బొగ్గు ధరలు పెరగడం.. బొగ్గు ట్రాన్స్ పోర్టు ఖర్చు ఈ కారణంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందనే కారణం చెప్పారాయన. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు శ్రీధర్.

    ఇదీ చదవండి : టీడీపీ సీఎం అభ్యర్థిగా పాల బుగ్గల పసివాడు.. చంద్రబాబు రియల్ బ్రోకర్ అంటూ విజయసాయి ఫైర్

    ఈ టారీఫ్ కారణంగా డిస్కంలకు వచ్చే అదనపు ఆదాయం 1400 కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. నెట్ వర్క్, సప్లై కాస్టులు గత ఏడాదితో పోల్చితే 6.99 శాతం పెరిగినట్లు వివరించారు. అంతేకాదు విద్యుత్ ధరల పెంపుదల దారుణమని ప్రశ్నిస్తే.. పెట్రోల్ ధరలకు లింకు పెట్టారు. గత 10 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని.. ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఆ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం చెబుతామంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. గత ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నట్లు, ఈ ప్రభుత్వం పీపీఏలు రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో పీపీఏల ధరలు ఆయా రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినవని, అమరావతి. ఏపీలో రాబోయే రోజుల్లో డిమాండ్ బాగా పెరగనుందని సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు.

    ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు సీఎం శుభవార్త.. సమగ్ర భూ సర్వేతో దేశానికి రాష్ట్రం దిక్సూచి కావాలన్న జగన్

    తాజా పరిస్థితుల్లో 11,123 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడకుండా.. ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు, డిస్కంల ప్రతిపాదనలపై సింగిల్ టెలిస్కోపిక్ విధానంలో స్లాబ్ లు ఇచ్చామన్నారు. పెరిగిన చార్జీలతో డిస్కంలకు రూ. 1400 కోట్లు మాత్రమే ఆదాయమని, అయితే ట్రూ అప్ చార్జీల కారణంగా 2100 కోట్లు రూపాయలు మాత్రమే వినియోగదారులపై భారం పడనుందన్నారు. 2022 – 23లో రూ. 2100 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని వెల్లడించారు. బోగ్గు ధరలు పెరగడం, బొగ్గు రవాణా ఖర్చులు పెరగడంతో చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఇదే విషయాన్ని చెప్పారు. ఏడాదికి 14 శాతం ఇన్పుట్ రేటు పెరగడంతో స్వల్పంగా రేట్లు పెంచాల్సి వచ్చినట్లు, యూనిట్ విద్యుత్ 6.98 రూపాయలు పడుతుందన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Electric bill, ELectricity

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు