Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT CANCELLED FREE ACCOMMODATION FOR HOD EMPLOYEES FULL DETAILS HERE PRN GNT

AP Government: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఇకపై అవన్నీ రద్దు..!

ఏపీ సచివాలయం (ఫైల్)

ఏపీ సచివాలయం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులకు వసతికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి (Amaravati) లో పనిచేస్తున్న వారికి ఉచిత వసతిని రద్దు చేసింది. రేపటిలోగా ప్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులకు వసతికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి (Amaravati) లో పనిచేస్తున్న వారికి ఉచిత వసతిని రద్దు చేసింది. రేపటిలోగా ప్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో గత ప్రభుత్వ హయాంలో హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి ఉద్యోగులకు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఉచిత వసతి కల్పించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడువు ముగిసినా దశలవారిగా పొడిగిస్తూ వచ్చింది. ఐతే ప్రభుత్వం ఇచ్చిన పొడిగించిన గడువు జూన్ 30తో ముగుస్తుండటంతో ఫ్లాట్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేప‌టిలోగా ఫ్లాట్ల‌ను ఖాళీ చేయాల‌ని కూడా స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

    రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచే పాలన సాగించాలని భావించిన టీడీపీ ప్రభుత్వం.. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలించింది. ఉద్యోగులకు 2017 నుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో వసతి కల్పించింది. వారికి సంబంధించిన ఇంటి అద్దెను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐతే ప్రభుత్వం ఉచిత వసతి రద్దు చేసి సంబంధిత ఫ్లాట్లను అప్పజెప్పాలని తెలిపింది. ఆ ఫ్లాట్లను మంచి స్థితిలోనే ఉంచాలని.. ఆయా ఫ్లాట్ల‌కు ఏదైనా న‌ష్టం జ‌రిగి ఉంటే దానికి ఉద్యోగులే బాధ్య‌త వ‌హించాలని కూడా త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

    ఇది చదవండి: జగన్ బటన్ నొక్కితే మా గ్రాఫ్ పడిపోతోంది.. కార్యకర్తలు అప్పులపాలయ్యారు.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..


    ఇదిలా ఉంటే ఉద్యోగులు అమరావతి వచ్చినప్పటి నుంచి వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేస్తోంది. ఈనెల 27తో ఆ గడువు కూడా ముగిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఉచిత వసతి రద్దుపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం.. వారానికి ఐదు రోజుల పని విషయంలో ఎటూ తేల్చలేదు.

    ఇది చదవండి: ఈసారి ఎన్నికల నినాదం ఇదే.. ప్లీనరీ నుంచే ప్రజల్లోకి..! వైసీపీ నేతల కీలక ప్రకటన..


    ఐతే గడువు ముగిసిన ప్రతిసారి సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం.. ప్రభుత్వం ఉచిత వసతిని పొడిగించడం జరుగుతున్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం పొడిగింపు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా జీతాలకే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉచిత వసతికి చెల్లించే అద్దెలు అదనపు భారంగా మారనున్నాయి.



    అలాగే ఇటీవల పీఆర్సీ, ఇతర అంశాల విషయంలో ఉద్యోగుల పోరాటం, ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో పొడిగింపు ఉంటుందా లేదా అనేది కూడా అనుమానంగానే మారింది. ఇప్పటికే ఐదేళ్లుగా ప్రభుత్వం ఉచిత వసతి కల్పిస్తోంది. సొంత నివాసాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా సూచిస్తోంది. మరి ప్రభుత్వ ఆదేశాలపై దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు