Andhra Pradesh: ఏపీలో సిగరెట్, గుట్కా షాపులపై నిషేధం.. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు.. ఎక్కడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ స్కూళ్లను ఆదర్శవంతంగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు చెడు వ్యసనాల వైపు మళ్లకుండా, పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా స్కూళ్ల సమీపంలో పాన్, గుట్కా, సిగరెట్ షాపులను తొలగించేందుకు నడుంబింగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు విక్రయించే షాపులను ఉంచకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ వ్యహారాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా పర్యవేక్షించనుంది. ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులను ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు మూడు స్కూళ్ల బాధ్యతలను అప్పగిస్తారు. వీరంతా స్కూలుకు వెళ్లి సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది.

    ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ ను తయారు చేయనుంది. ఈ యాప్ ద్వారా పాఠశాలలు, వాటి సమీపంలోని పరిస్థితులను ఫోటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ లో ఉంచిన సమాచారం ఆధారంగా స్కూళ్ల సమీపంలో ఎవరైనా గుట్కా, పాన్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

    ఇది చదవండి: ఏపీలో ఆ ఒక్కజిల్లాను వణికిస్తున్న కరోనా... కారణాలు ఇవేనా..?



    అలాగే పాఠశాలల సమీపంలో ఎవరైనా పొగత్రాగినా, మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఐతే మధ్యం షాపులు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించడానికి వీల్లేదు. ప్రతి స్కూల్ ను ప్రభుత్వ పర్యవేక్షణకు మ్యాపింగ్ చేసి వీటిని ఆన్ లైన్ పోర్టల్ కు అనుసంధానం చేస్తారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

    Telangana Inter Results 2021: ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు... News18లో చూసుకోండి



    విద్యనభ్యసించే చిన్నపిల్లలపై చెడు అలవాట్ల ప్రభావం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే స్కూల్ పరిసర ప్రాంతాల్లో చెడు అలవాట్ల వచ్చే అనర్ధాలను సూచించేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయులు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణను రుపొందించి అమల్లోకి తీసుకురానున్నారు. కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకునే నాటికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విద్యాశాఖ-వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా తీసుకుంటున్న చర్యలపై తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: