ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అంతా భక్తిమయం...

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... వన్ బై వన్ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాలక మండళ్లపై దృష్టిసారిస్తోంది. ఆలయాల అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసింది అని అనుకోవచ్చు.

news18-telugu
Updated: February 21, 2020, 8:17 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అంతా భక్తిమయం...
సింహాచలం పుణ్యక్షేత్రం
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు వైసీపీ ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పాలకమండళ్లు అంటే... ఏవో పడివుండేవి కావు. ఒక్కో మండలికీ 16 మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించింది. అంత మందిని ఎందుకు నియమించిందో మనం ఆలోచించుకోవచ్చు. వాళ్లంతా ఆలయాల్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి, అందుకోసం ఏం చెయ్యాలి, నిధులను ఎలా సక్రమంగా వినియోగించాలి, భక్తుల సంఖ్యను పెంచడం ఎలా ఇలా... ఎన్నో అంశాల్ని ఆలోచించి, ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండబోతున్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది. విజయవాడ దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ హామీతో ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది కూడా ఓ మంచి ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచీ... మన పురాణాల్లో కూడా... పూజా కార్యక్రమాల్లో మహిళలు తప్పనిసరి. మహిళలు లేకుండా కొన్ని యాగాలు కూడా నిర్వహించరు. అందువల్ల పాలక మండళ్లలో మహిళల్ని ఎక్కువగా నియమించడం మంచి పరిణామం.

సింహాచలం : లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (ఛైర్మన్‌)

2. దాడి దేవి
3. వారణాసి దినేశ్‌రాజ్‌


4. నల్లమిల్లి కృష్ణారెడ్డి
5. జి.మాధవి6. గడ్డం ఉమ
7. రాగాల నర​సింహారావు నాయుడు
8. దాడి రత్నాకర్‌
9. సూరిశెట్టి సూరిబాబు
10. రంగాలి పోతన్న
11. సంచిత గజపతిరాజు
12. దొనకొండ పద్మావతి
13. నెమ్మాడి చంద్రకళ
14. సిరిపురపు ఆశాకుమారి
15. విజయ్‌ కే. సోంధి
16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు)

విజయవాడ : దుర్గ గుడి పాలక మండలి సభ్యులు
1. పైలా సోమినాయుడు
2. కటకం శ్రీదేవి
3. డీఆర్‌కే ప్రసాద్‌
4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ
5. పులి చంద్రకళ
6. ఓవీ రమణ
7. గంటా ప్రసాదరావు
8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి
10. కార్తీక రాజ్యలక్ష్మి
11. నేటికొప్పుల సుజాత
12. నేలపట్ల అంబిక
13. కానుగుల వెంకట రమణ
14. నెర్సు సతీశ్‌
15. బండారు జ్యోతి
16. లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ (పధాన అర్చకుడు)

ద్వారకా తిరుమల : వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (ఛైర్మన్‌)
2. మాతూరు శ్రీవల్లీ
3. గ్రంథి శేషగిరిరావు
4. కర్పూరం గవరయ్య గుప్తా
5. గూడూరి ఉమాబాల
6. కనకతాల నాగ సత్యనారాయణ
7. కొండేటి పద్మజ
8. కొత్తా విజయలక్ష్మి
9. చిలువులూరి సత్యనారాయణరాజు
10. కుంజా శాంతి
11. నందిని బందంరావూరి
12. మనుకొండ నాగలక్ష్మి
13. జి. సత్యనారాయణ
14. మేడిబోయిన గంగరాజు
15. వీరమళ్ల వెంకటేశ్వరరావు
16. పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి)
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు