• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT ANNOUNCES RS 25 LAKH EX GRATIA FOR KIN OF GOVT DOCTORS DIED OF COVID 19 SU

Andhra Pradesh: ఏపీలో కరోనాతో చనిపోయిన డాక్టర్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల పరిహారం

సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ కరోనాతో మరణించిన డాక్టర్లు, నర్సుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ కరోనాతో మరణించిన ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన డాక్లర్లు, నర్సుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. డాక్టర్ల కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షలు, నర్సుల కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. అలాగే కరోనాతో మృతిచెందిన ఎంఎన్‌వో (మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ) కుటుంబ సభ్యులకు రూ. 15 లక్షలు, ఎఫ్ఎన్‌వో(ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ) కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్టు తెలిపింది.

    కోవిడ్‌తో మరణించిన రెగ్యులర్ వైద్య ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా మంజూర్ చేసేందుకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు అనుమతులు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.

    ఇక, ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 59 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,14,393కి కరోనా కేసులు చేరగా, కరోనాతో 11,999 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 10 , 114 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 17,22,381కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: