Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT ANNOUNCED SOME MORE LOCKDOWN RELAXATIONS FOR STREET VENDORS AK

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Lockdown relaxations: లాక్‌డౌన్ కారణంగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

    కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను సాధ్యమైనంత తొందరగా మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం... ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మరి కొన్నింటికి లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది. ఇక లాక్‌డౌన్ కారణంగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. స్ట్రీట్ ఫుడ్స్‌ సైతం తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆయా షాపులు పాటించాల్సిన విధివిధానాలపై సర్క్యులర్ జారీ చేసింది.

    ఇక రోడ్లపై ఆహారం అమ్మేవారంతా కేవలం పార్సిల్‌కు మాత్రమే తమ వ్యాపారాన్ని పరిమితం చేసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని షాపుల్లో ట్రైల్‌ రూమ్‌లకు అనుమతిని నిరాకరించింది. వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వారు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వ తాజా ఆదేశాల్లో వివరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Lockdown, Lockdown relaxations

    తదుపరి వార్తలు