• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT ALLOTTED TWO ACRES LAND TO PV SINDHU IN VIZAG HERE THE FULL DETAILS SRD

PV Sindhu కి విశాఖలో రెండెకరాల భూమిని కేటాయించిన జగన్ సర్కార్.. కారణమిదే..

ఏపీ సీఎం జగన్ తో పీవీ సింధు (ఫైల్ ఫోటో)

PV Sindhu : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, భారత స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు (PV Sindhu) భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూర‌ల్ చినగ‌డిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.

  • Share this:
    ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, భారత స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు (PV Sindhu) భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూర‌ల్ చినగ‌డిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ భూమిని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉత్వర్వల్లో వెల్లడించింది.అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమి ఉప‌యోగించాల‌ని క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌ కోసం ఉపయోగించవద్దని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించింది.గతంలోనే పీవీ సింధు అకాడమీకి రెండు ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..సీఎం జగన్ (AP CM Jagan) కు సింధు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని తాను భావించడం జరిగిందని, భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

    తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని, తర్వాతి దశలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉందని సింధు గతంలో వెల్లడించారు. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాలని సీఎం జగన్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూరల్‌లో ఉచితంగా రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వుల జారీ చేశారు.

    అకాడ‌మీని రెండు ఫేజుల్లో నిర్మించ‌నున్నట్టు ప్రభుత్వానికి సింధు తెలిపింది. ఒక్కో ఫేజ్‌లో 5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్నట్టు వెల్లడించింది. ఇక, సింధు ఒలింపిక్స్ సన్నాహకాల్లో ఉంది. ఎలాగైనా, ఒలింపిక్స్ లో పతకం సాధించాలని పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: