ANDHRA PRADESH GOVERNMENT ALL SET TO DISTRIBUTE LAPTOP FOR STUDENTS THEY CALLED TENDERS NGS
Good News: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. అందరికీ ల్యాప్ టాప్ లు వచ్చేస్తున్నాయి.. లోపాలు ఉంటే ఏం చేయాలి..?
ల్యాబ్ టాప్ లు వచ్చేస్తున్నాయి
Laptops for students: ఏపీలో పేద విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే వారికి ల్యాప్ టాప్స్ అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే ఆ ల్యాప్ టాప్స్ లో లోపాలు ఉంటే ఏం చేయాలో తెలుసా..?
Jagananna Ammovodi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న అమ్మఒడి ( Jagananna Amma Vodi)’, ‘జగనన్న వసతి దీవెన (Jagananna vasathi divena)’స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలని (Laptop distribution) ఏపీ సర్కార్ (Andhra Pradesh Government) గతంలోనే నిర్ణయించింది. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌ల కొనుగోలు చేయాలని భావిస్తోంది. లేటెస్ట్ కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్ ఆహ్వానిస్తోంది. ల్యాప్‌టాప్‌ల సరఫరాకు బిడ్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆహ్వానించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది. ఈ నెల 17 లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ జ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పథకాల నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు అందుకున్న విద్యార్థులు.. వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు.
సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా apjudicialpreview@gmail.comకు అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓసారి అభ్యంతరాలు పరిశీలించాక ల్యాప్ టాప్ లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతోంది. అప్పుడు దాఖలైన బిడ్లను పరిశీలించి ల్యాప్ టాప్ ల కొనుగోలుకు తుది ఆర్డర్ ఇవ్వబోతోంది. ల్యాప్ టాప్ ల పంపిణీ ద్వారా విద్యార్ధులకు మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
సాధారణంగా ప్రతీ ఏటా అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో అమలు చేస్తున్నందున ఆ లోపు డబ్బులు వద్దనుకునే వారికి ల్యాప్ టాప్ లు పంపిణీ చేయబోతున్నారు. దీంతో్ ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా తగ్గే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డబ్బులే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు భారం పెరుగుతోంది. ఆ మేరకు ఆర్ధిక వనరులు అందుబాటులో లేకపోవడంతో ల్యాప్ టాప్ ల పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.