• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH GOVERNMENT ALL SET FOR THE PRESTIGE OF THE NEW IDOLS IN RAMATIRTHAM OF VIZANAGARAM DISTRICT PRN

Ramatheerdham Incident: రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్టకు రంగం సిద్ధం.., ముహూర్తం ఎప్పుడంటే

Ramatheerdham Incident: రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్టకు రంగం సిద్ధం.., ముహూర్తం ఎప్పుడంటే

రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్టకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రామతీర్థం ఆలయంలో (Ramatheerdham Temple) కోదండరాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో శ్రీ కోదండర రామస్వామి విగ్రహాల పుననఃప్రతిష్టకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో రామతీర్థం ఆలయంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాజకీయ దుమారం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ నేతల ఆరోపణలు, సవాళ్ల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.., ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో రామతీర్థంలో శ్రీ కోదండర రామస్వామి విగ్రహాల పుననఃప్రతిష్టకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం నుంచి విగ్రప పునఃప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలను దేవాదాయశాఖ ప్రారంభించనుంది. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విగ్రహాల పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు.

    ఆలయ ఆధునీకరణకు ప్రణాళిక
    రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హోమం పూర్తైన తర్వాత సాంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయ ఆధునీకరణలో భగంగా గర్భాలయాన్ని కదిలించకూడదని అధికారులు భావిస్తున్నారు. పురానతన కాలంలో నిర్మించినా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ లోపలి భాగాని మాత్రమే పూర్తిగా ఆధునికీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారాలను పూర్తిస్థాయిలో పునర్నిర్మించనున్నారు. కొండపై జరిగే అభివృద్ధి పనులకు సరిపడా నీరు అందుబాటులో ఉంచేందుకు దేవాదాయశాఖ యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తోంది. ఆలయంతో పాటు రామతీర్థం కొండ మెట్లమార్గాన్ని కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని విస్తరించనున్నారు. కొండపైనున్న ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరును కూడా పూర్తిస్థాయిలో ఆధునీకీకరించనున్నారు.

    సిద్ధమవుతున్న నూతన విగ్రహాలు
    మరోవైపు రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రుడి మూలవిరాట్ తో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు రూపొందిస్తున్నారు. ఈనెల 23నాటికి విగ్రహాలను శిల్పులు దేవాదాయశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రామతీర్థం ఆలయ ఆధునికీకరణ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది.

    Andhra Pradesh, Hindu Temples, Hindu Temples Vandalism, YSRCP, TDP, BJP, Hindu Religion, Andhra Pradesh Government, ఆంధ్రప్రదేశ్, హిందూ ఆలయాలు, ఆలయాలపై దాడులు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, హిందూమతం,
    రామతీర్థం ఆలయాన్ని పరిశీలిస్తున్న పోలీసులు


    కొనసాగుతున్న దర్యాప్తు
    మరోవైపు రామతీర్థం ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే సీఐడీ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం ఆలయాన్ని పరిశీలించింది. విగ్రహ ధ్వంసానికి వినియోగించిన రంపాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతానికి అనుమానితులను విచారించారే తప్ప నిందితులు మాత్రం పట్టుబడలేదు. ఆలయంపై దాడులు చేసిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: